ఈ ఉరుకుల పరుగుల జీవితం లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాల అవసరం .. మరీనా ఆహారపు అలవాట్లు జీవనశైలి మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి కాబట్టి రోజువారీ జీవనశైలి లో భాగంగా యోగా చేయడం అలవాటు చేసుకోవడం ద్వారా అనేకమైన ఆరోగ్యసమస్యల నుంచి బయటపడవచ్చు . యోగ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించడానికి ఏ రోజును ప్రపంచ యోగ దినోత్సవంగా జరుపుకుంటాం .
కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం ఉత్తేజితుల్ని చేస్తుందని... ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నాటకలోని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో మోడి పాల్గొని యోగాసనాలు వేశారు.
అనంతరం ప్రధాని మోడి మాట్లాడుతూ ... యోగా ఏ ఒక్కరికో చెందినది కాదనీ... అందరిదని అన్నారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని చెప్పారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సహా ప్రపంచ దేశాలకు మోడి ధన్యవాదాలు చెప్పారు. భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని తెలిపారు. కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్నారు. యోగా దినోత్సవం.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక అని చెప్పారు.
మరిన్ని చదవండి .
భారీ వర్ష సూచనా: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు, ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక !
ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించిందని, కరోనా విపత్తు సమయంలోనూ దీన్ని నిర్వహించామని మోడి తెలిపారు. సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందని, జీవన విధానానికి మార్గంగా నిలుస్తుందని అన్నారు. ఇది వ్యక్తికే పరిమితం కాదనీ.. సకల మానవాళికి ఉపయుక్తమైనదని చెప్పారు. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని ప్రధాని మోడి ఆకాంక్షించారు. యోగా దినోత్సవం.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక : ప్రధాని మోడి
మరిన్ని చదవండి .
Share your comments