News

భారీ వర్ష సూచనా: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు, ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక !

Srikanth B
Srikanth B
Heavy Rain Alert in Telugu States
Heavy Rain Alert in Telugu States

భారీ వర్ష సూచనా : నైరుతి రుతుపవనాల రాకతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.

అనకాపల్లి జిల్లాలో మూడు మండలాలు చీడికాడ, కె.కొత్తపాడు, దేవరపల్లిలకు పిడుగు ప్రమాదం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి మండాలకు విపత్తులనిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పార్వతీపురంమన్యం జిల్లాలో పాచిపెంట,బలిజిపేట,పాలకొండ, సీతంపేట ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లోని మొత్తం 41 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ మండలాల్లో పిడుగులు పడొచ్చు. 16 మండలాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం, టెక్కలి, సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి సిగడాం విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలస మండలాలకు పిడుగు సూచన ఉంది.

మరిన్ని చదవండి .

ప్రపంచం లోనే అతిపెద్ద మంచి నీటి చేప.. దాని బరువు ఎంతో తెలుసా ?

రైతులకు శుభవార్త: PM కిసాన్ 12వ విడత ఈ నెలల లో రానున్నది !

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో

కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడింది. దీని వల్ల ప్రస్తుతం కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ​, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి

మరిన్ని చదవండి .

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త ..NPDCL జాబ్ నోటిఫికేషన్..!

Share your comments

Subscribe Magazine