News

ప్రపంచం లోనే అతిపెద్ద మంచి నీటి చేప.. దాని బరువు ఎంతో తెలుసా ?

Srikanth B
Srikanth B
World Largest fresh water Fish found in Cambodia
World Largest fresh water Fish found in Cambodia

చేప అనగానే ప్రతి ఒక్కరిని గుర్తుకు వచ్చేది ఒక కిలోనో లేదా రెండు కిలోలు మహా అయితే అయిదు కిలోల చేపలను చూసివుంటాం ..కానీ మనం ఈ  రోజు మాట్లాడబోయే  చేప సుమారుగా 300 వందల కిలోలతో ప్రపంచం లోనే అతి పేద చేప గ పేరుగాంచింది. జాలర్లు వేట సాగిస్తుండంగా హఠాతుగ్గా వాలా  చిక్కింది .

కంబోడియా మెకాంగ్‌ నదిలో ఈ భారీ చేప బయటపడింది . పదుల  సంఖ్యలో జాలర్లు దీనిని ఒడ్డుకు లాకొచ్చారు . ఖేమర్‌ భాషలో క్రిస్టెన్డ్‌ బోరామీ(పూర్తి చంద్రుడు) అని పిలవబడే ఈ చేపకు.. దాని ఆకారం వల్లే ఆ పేరు వచ్చింది. అయితే దొరికిన ఈ భారీ చేపను పరిశీలించిన పరిశోధకులు.. జాలర్లను ఒప్పించి ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌తో తిరిగి నీళ్లలోకి వదిలేశారు. ఇక నుంచి దాని కదలికలను పరిశీలించనున్నారు.

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌లో ‘మాంస్టర్‌ ఫిష్‌’ షో నిర్వాహకుడు జెబ్‌ హోగన్‌.. దీనిని అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి చేపగా గుర్తించారు. ఇంతకుముందు 2005లో థాయ్‌లాండ్‌లో 293 కేజీల బరువున్న ఓ క్యాష్‌ పిష్‌ను పరిశోధకులు గుర్తించారు.

మరిన్ని చదవండి .

రైతులకు శుభవార్త: PM కిసాన్ 12వ విడత ఈ నెలల లో రానున్నది !

మెకాంగ్‌ నది ప్రపంచంలోనే చేపల ఆవాసం ఎక్కువగా ఉండే మూడో నది. మితిమీరి చేపలు పట్టడం, కాలుష్యం, ఉప్పునీటి చొరబాటు, అవక్షేపాల క్షీణత కారణంగా చేపల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది అని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌లో ‘మాంస్టర్‌ ఫిష్‌’ షో నిర్వాహకుడు జెబ్‌ హోగన్‌ పేర్కొన్నారు .

మరిన్ని చదవండి .

తండ్రి కొడుకు ఒకేసారి పదవ పరీక్ష...ఇద్దరిలో ఎవరు పాసయ్యారు?

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త ..NPDCL జాబ్ నోటిఫికేషన్..!

Share your comments

Subscribe Magazine