News

తండ్రి కొడుకు ఒకేసారి పదవ పరీక్ష...ఇద్దరిలో ఎవరు పాసయ్యారు?

Srikanth B
Srikanth B

పూణేకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి మరియు అతని కుమారుడు ఈ సంవత్సరం మహారాష్ట్ర  10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఆ వ్యక్తి పరీక్షలో ఉత్తీర్ణత సాధించగా కొడుకు ఫెయిల్ అయ్యాడు.

పూణేకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి మరియు అతని కొడుకు ఇద్దరూ ఈ సంవత్సరం 10వ తరగతి మహారాష్ట్ర బోర్డు పరీక్షలకు హాజరయ్యారు, అయితే తండ్రి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కొడుకు ఫెయిల్ కావడంతో ఆ కుటుంబం సంతోష పడాలో లేక బాధ పడాలో తెలియని అయోమయ పరిస్థితి లోకి వెళ్ళింది.

మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన 10వ తరగతి వార్షిక  పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.అయితే అసలు విషయానికి వస్తే కుటుంబ పోషణ కోసం 7వ తరగతి తర్వాత చదువుకు స్వస్తి చెప్పి ఉద్యోగంలో చేరిన  భాస్కర్ మళ్లీ చదువును కొనసాగించాలని భావించాడు. 30 ఏళ్ల విరామం తర్వాత కొడుకుతో కలిసి ఈ ఏడాది పదవ పరీక్షలకు హాజరయ్యాడు.

పూణే నగరంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ డయాస్ ప్లాట్‌లో నివాసం ఉంటున్న భాస్కర్ విలేకరులతో మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ ఎక్కువ చదువుకోవాలనుకున్నాను, కానీ కుటుంబ బాధ్యతల వలన  కొనసాగించలేకపోయాను. అయితే ఎప్పటి నుంచో, నేను చదువును తిరిగి ప్రారంభించాలని మరింత సంపాదించడానికి సహాయపడే కొన్ని కోర్సులు చేయాలని ఆసక్తిగా ఉన్నాను. అందుకే, నేను 10వ తరగతి పరీక్షలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాను అని  అతను చెప్పాడు.

అతని కుమారుడు సాహిల్ మాట్లాడుతూ మా నాన్న పదవ  తరగతిలో ఉతీర్ణత సాధించడం  చాలా  సంతోషంగా ఉంది. నేను కూడా నేను సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతాను ఈ సారి ఖచ్చితంగా పాస్ అవుతానని విశ్వాసం వ్యక్తం చేసారు.

 

మరిన్ని చదవండి.

నాబార్డ్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు....నెలకి జీతం ₹4.5 లక్షలు!

Share your comments

Subscribe Magazine