News

రైతు గా మారి పొలం పనులలో నిమగ్నమైన పోలీస్ అధికారి..!

KJ Staff
KJ Staff

మన దేశానికి రైతు వెన్నుముక అని చెబుతారు. దేశానికి రైతు లేనిదే మనం లేము. దేశంలోని ప్రజల కోసం వరి పండించడానికి రైతులు ఎంత కష్టపడతారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలా రైతుల కష్టం తెలిసిన ఒక పోలీస్ అధికారి రైతులతో పాటు వ్యవసాయ పనులలో నిమగ్నమై హలం చేత పట్టి.. పొలంలో దిగి వ్యవసాయ పనులు చేస్తూ ..అందరినీ ఆశ్చర్యపరిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్‌ జోన్ రఘునాథపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ ఖమ్మం జిల్లా టేకుల పల్లి గ్రామానికి చెందినవారు.లింగాల ఘనపూర్‌లో పల్లెప్రగతి కార్యక్రమం బందోబస్తు నుంచి తిరిగి వస్తున్న సిఐ వినయ్ కుమార్ దృష్టి కుందారం గ్రామంలోని పొలాల్లో పొలం పనులు చేస్తున్న కూలీలపై పడింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా వెంటనే పొలంలోని కూలీల వద్దకు వెళ్లి వారి వ్యవసాయ పనులలో తాను భాగమయ్యారు. అక్కడ కూలీలు చేయొద్దని ఎంత భావిస్తున్నప్పటికీ నేను కూడా ఒక రైతు బిడ్డనే, నేను కూడా వ్యవసాయం చేసిన వాడినేనని వారితో పాటు పొలం పనులు చేశారు.

సీఐ వినయ్ కుమార్ ఏకంగా ఒక గంట పాటు కూలీలతో పాటుగా పొలం పనులు చేశారు. వ్యవసాయానికి సంబంధించిన మెళుకువలను రైతులను అడిగి తెలుసుకున్నారు.వారికి ఏ సమయంలోనైనా ఏ కష్టమొచ్చినా ఒక రైతు బిడ్డగా వారిని ఆదుకోవడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని,వారికి తన వంతుగా ఏదైనా సహాయం కావాలి అనిపిస్తే వెంటనే తనని సంప్రదించాలని అతని వ్యక్తిగత ఫోన్ నెంబర్ ను రైతులకు ఇచ్చారు.ఈ విధంగా ఒక గొప్ప ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా ఏమాత్రం గర్వం, అహంకారం లేకుండా సీఐ వినయ్ కుమార్ వారితో పాటు గంట పాటు వ్యవసాయ పనులలో పాల్గొనడం వారికి ఎంతో ఆనందంగా ఉందని కూలీలు తమ ఆనందాన్ని తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine