News

మొక్కే కదా అని తీసేయకండి.... వాటికి కూడా ఒత్తిడి ఉంటుంది!

KJ Staff
KJ Staff

సాధారణంగా ఈ భూమిపై మనుషులకి, మాత్రమే మనసు ఉంటుందని,వారు ఎదుర్కొనే ఒత్తిడి, అసహనం వంటి హావభావాలను ఇతరులకు అర్థమయ్యే విధంగా వ్యక్తపరుస్తారు.మనుషులు ఏ విధంగా అయితే తనలో ఒత్తిడిని నిస్సహాయతను బయటకు తెలియజేస్తారో మొక్కలు కూడా అదే విధంగా దానిపై కలిగే ఒత్తిడిని తెలియజేస్తుందని తాజాగా శాస్త్రవేత్తలు నిరూపించారు. మొక్కలు వాటిపై అధిక సూర్యరశ్మి పడిన, లేక తగినంత సూర్యరశ్మి, నీరు, సరైన వాతావరణ పరిస్థితులు లేకపోయినా మొక్కలు వచ్చే మార్పులు వస్తాయని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు డాక్టర్ షిలో రోసెన్‌వాస్సర్ తెలియజేశారు.

డాక్టర్ షిలో రోసెన్‌వాస్సర్ అతని బృందం బంగాళదుంపల మొక్కల పై చేసిన పరిశోధనలలో ఈ విధమైనటువంటి ఆశక్తికర విషయాలను తెలియజేశారు. బంగాళదుంప మొక్కలను జన్యుపరంగా మార్పు చేసి మొక్కలో కలిగే ఒత్తిడిని గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా బంగాళాదుంప మొక్క క్లోరోప్లాస్ట్‌లో కొత్త జన్యువును చేర్చారు. మొక్క ఒత్తిడికి గురైనప్పుడు, కొత్త జన్యువు దానిలో ఒక నిర్దిష్ట ప్రోటీన్ మొత్తాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు.

అదేవిధంగా మొక్కకు తగినంత నీరు, అధిక మొత్తంలో సూర్యరశ్మిని ఎదుర్కొన్నప్పుడు ఆ మొక్క కాంతిని చదరగొడుతుందని తెలియజేశారు. ఈ విధంగా మొక్కలలో కలిగే ఒత్తిడి వల్ల రంగులు మార్చే ప్రక్రియను మనం నేరుగా కళ్ళతో చూడలేము. అందుకోసమే ఈ మార్పును చూడటానికి మొక్కకు ఒక ప్రత్యేకమైన కెమెరాని ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా మొక్కల్లో జరిగే మార్పులను గమనించవచ్చని, మొక్కకు కూడా అధిక ఒత్తిడి కలిగినప్పుడు అవి మన మాదిరే తన భావాలను వ్యక్త పరుస్తాయని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine