News

కిలో బంగాళదుంప రూ.5

KJ Staff
KJ Staff

బంగాళదుంపల ధరలు భారీగా తగ్గాయి. పలు రాష్ట్రాల్లో కిలో బంగాళదుపంలు రూ.5 నుంచి 6కే వినియోగదారులకు లభిస్తున్నాయి. అయితే ధరలు తగ్గడం వల్ల రైతులు మాత్రం తీవ్ర నష్టపోతున్నారు. ఈ ఏడాది బంగాళదుంప పంట బాగా పడింది. దీని వల్ల డిమాండ్ తక్కువ కావడం వల్లన బంగాళదుంప ధరలు భారీగా తగ్గాయ. దీని వల్ల వినియోగదారులకు లాభం జరుగుతున్నా.. రైతులు మాత్రం నష్టపోతున్నారు.

గత ఏడాది కంటే ఈ ఏడాది బంగాళదుంపల ధరలు దాదాపు 50 శాతం తగ్గాయని  కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  బంగాళదుంపల పంట బాగా పండే ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో టోకు ధర గత ఏడాది ఇదే సమయంతో పొలిస్తే 50 శాతం తక్కువగా ఉందని కేంద్రం వెల్లడించింది.

ఢిల్లీలో గత శుక్రవారం బంగాళదుంప రిటైల్ ధర కిలో రూ.15 ఉంది. అయితే గత ఏడాది క్రితం అదే రోజున కిలో రూ.30కి ఉంది. దీనిని బట్టి చూస్తే.. సగానికి సగం తగ్గినట్లు అర్ధమవుతోంది. ఇక ఏడాది క్రితం యూపీలో టోకు ధరలు కిలో రూ.8 నుంచి 9 మధ్య ఉన్నాయి. 

Related Topics

Potato

Share your comments

Subscribe Magazine