వేసవి కాలం వచ్చింది అంటే చాలు నిమ్మకు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఎందుకంటే నిమ్మలో అధికంగా విటమిన్ సి అనేదాన్ని కలిగి ఉంటుంది. ఎండ తాపాన్ని నుంచి బయటపడటానికి ఈ నిమ్మ బాగా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మరసాన్ని ప్రజలు ఎక్కువగా మజ్జిగ మరియు షర్బత్ లో వాడతారు. ఈ వినియోగం అనేది వేసవి కాలంలో మరింతగా పెరుగుతుంది. దీనితో మార్కెట్ లో నిమ్మ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
నేడు మార్కెట్ లో 40 కిలోల నిమ్మకాయల బస్తా ధర రూ.3 వేల వరకు పలుకుతుంది. ఈ నిమ్మ ధర అనేది రూ.5 వేల వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ లో నిమ్మకు అధిక ధరలు పలుకుతున్న చెట్లకు కాయలు లేవని రైతులు బాధ పడుతున్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వలన పంటలు బాగా దెబ్బతిన్నాయి అని రైతులు చెబుతున్నారు. అమాంతంగా నిమ్మ ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సుమారుగా నంద్యాల జిల్లావ్యాప్తంగా రైతులు 597 హెక్టార్లలో నిమ్మపంటను సాగు చేస్తున్నారు. రైతులు ఆళ్లగడ్డ మండలంలో 1,200 ఎకరాలు, చాగలమర్రి మండలంలో 130 ఎకరాలు, రుద్రవరం 20 ఎకరాలు, శిరివెళ్ల 3 ఎకరాలు, దొర్నిపాడు 3 ఎకరాల్లో నిమ్మసాగు చేశారు. ఈ మండలాల్లో రైతులు ఒక్కో ఎకరానికి సుమారుగా రూ.2 లక్షలను నిమ్మపంటను సాగు చేయడానికి పెట్టుబడులు పెడుతున్నారు.
ఇది కూడా చదవండి..
ఇప్పుడు ఇంట్లో నుండే పాన్ - ఆధార్ కార్డు కర్రెక్షన్ చేసుకోండి ఇలా..
గతంలో ఈ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాలైన ఢిల్లీ, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. ఈ రాష్ట్రాలకు ప్రతిరోజు సుమారుగా 200 బస్తాలను విక్రయించేవారు. కానీ ప్రస్తుతం దిగుబడి ఎక్కువగా లేనందువలన కేవలం 30 బస్తాలు మాత్రమే ప్రతిరోజు విక్రయిషున్నారు.
నిమ్మకు డిమాండ్ అధికంగా ఉండడంతో పలు గ్రామాల్లో వ్యాపారులు రెండు నిమ్మకాయలు 15 నుండి 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. కొంతమంది వ్యాపారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లిమరీ నిమ్మను కొనుగోలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం మార్కెట్ లో నిమ్మకు రూ.250 నుంచి రూ.300 మాత్రమే ధరలు పలికాయి. దీనితో రైతులు దిగులు పడ్డారు. కానీ ప్రతుతం మార్కెట్ లో నిమ్మ ధరలు పెరిగినందున రైతులు ఆనందంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments