ఈ నెల 6 వ తేదీన కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రాహుల్ గాంధీ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేసింది ,రైతు పక్షంగా సాగిన ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరియు కాంగ్రెస్ పాల్గొన్నారు , రైతు పక్షం గ సాగిన ఈ సభ లో రేవంత్ రెడ్డి రైతుల పై వరాల జల్లులు కురిపించారు .
'రైతు సంఘర్షణ సభ' పేరుతో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రభుత్వం రాష్ట్ర రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. “ఛత్తీస్‌గఢ్‌లో, మేము వరి క్వింటాల్‌కు రూ. 2,500 చెల్లిస్తామని హామీ ఇచ్చాము మరియు మేము దానిని చేస్తున్నాము. తెలంగాణలో పసుపును క్వింటాల్‌కు రూ.12 వేలకు కొనుగోలు చేస్తాం. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు .
అదే విధం గ టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు లేదని తేల్చిచెప్పిన రాహుల్, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని పార్టీని కాంగ్రెస్ ఓడిస్తుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని పంటలకు ఎంఎస్‌పీ, రూ.2 లక్షల వరకు రుణమాఫీ సహా రైతుల డిమాండ్‌లన్నింటినీ అంగీకరిస్తామని హామీ ఇస్తూ ‘వరంగల్ డిక్లరేషన్’ను ప్రకటించారు .
“తెలంగాణ సులభంగా ఏర్పడలేదు... ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం యువత తమ ప్రాణాలను అర్పించారు, తల్లులు రక్తాన్ని, కన్నీళ్లను త్యాగం చేశారు. ఒక వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడం కాదు.. మొత్తం ప్రజల అభ్యున్నతి కోసం కలలు కన్నారు’’ దానిని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నాశనం చేసారని విమర్శించారు .
Share your comments