News

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

KJ Staff
KJ Staff
Rain Alert
Rain Alert

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. చలికాలం పోయి ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో అనుకోకుండా వర్షాలు మొదలయ్యాయి. దీంతో రైతులు వాతావరణంకి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడటం మంచిది. అనుకోని వర్షాల కారణంగా రైతులు నష్టపోతూ ఉంటారు. దీంతో ముఖ్యంగా రైతులు ఎప్పటికప్పుడు వాతావరణంకి సంబంధించిన వివరాలను తెలుసుకుంటూ ఉండటం ఎంతో మంచిది. దీని వల్ల పంటకు నష్టం జరగకుండా చూసుకోవచ్చు.

తాజా సమాచారం ప్రకారం.. రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముంది వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అలాగే . శ్రీలంక తీరం నుంచి ఉత్తర తమిళనాడు వరకు నైరుతి బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడనుందని అధికారులు చెప్పారు. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారం వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి?

-శనివారం దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

-ఆదివారం తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం

Share your comments

Subscribe Magazine