గత వారంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షలకు చాల కుటుంబాలను రోడ్డుపాలు చేశాయి . ఇప్పుడిపుడే భారీ వర్షాల నుండి కాస్త గ్యాప్ ఇచ్చాడు వరుణదేవుడు. ఇక రెండ్రోజుల నుంచి తెరిపిచ్చింది. మళ్ళి రానున్న రెండురోజులు తెలంగాణలోని పలు జిల్లాలలో భారీవర్షాలు కురుస్తాయని వాతవరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందొ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, నారాయణపేట్, పెద్దపల్లి, సిరిసిల్ల, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఈదురు గాలులు గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. నిన్నటి వాతావరణాన్ని పరిశీలిస్తే, గరిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా ఉంది.
ఇది కూడా చదవండి..
వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం ఇతనే.. తేల్చేసిన జాతీయ సర్వే
రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరడం, తద్వారా వాహనాల రాకపోకలు గణనీయంగా మందగించడం గమనించాల్సిన విషయం. ఈ ఆందోళనకరమైన పరిస్థితిని ట్రాఫిక్ పోలీసులు సమస్య పరిష్కారానికి చురుకుగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేస్తున్నారు.
అదేవిధంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉత్తరవాయవ్య దిశగా కదులుతోందని వివరించింది. ఈ నెల 3 నుంచి 6 వరకు వాయవ్య భారతంలో వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ఇది కూడా చదవండి..
Share your comments