భారత ప్రభుత్వం 2019లో జల్ శక్తి అభియాన్ (JSA)ని ప్రారంభించింది. జలవనరుల మంత్రిత్వ శాఖ మరియు తాగునీరు,పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలు రెండు కూడా విలీనం చెంది జల్ శక్తి అభియాన్ పథకాన్ని అమలు చేసాయి.ఈ పథకం 2021 లో కూడా కొనసాగింది. గత సంవత్సరం మార్చ్ 22 న ప్రధాన మంత్రి జల్ శక్తి అభియాన్ పథకం కింద క్యాచ్ ది రైన్(catch the rain) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఇది అన్ని వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
అధికారక సమాచారం మేరకు ఇప్పటివరకు దేశంలో మొత్తంగా 340 జిల్లాల్లో 340 జలశక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంద్రప్రదేశ్ లో 13 జలశక్తి కేంద్రాలు ఉండగా తెలంగాణాలో 33 జలశక్తి కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, SPSR నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, వై.యస్.ఆర్ కడప వంటి జిల్లాలో జలశక్తి కేంద్రాలు స్థాపించబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా అన్ని జిల్లాల్లో జలశక్తి కేంద్రాలు స్థాపించబడ్డాయి.
జల్ శక్తి అభియాన్ (వర్షపు కేంద్రాలు )వల్ల ప్రయోజనాలు.
భారతదేశం ప్రపంచ జనాభాలో 18% మందిని కలిగి ఉంది,కానీ నీటి వనరులలో 4% మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నీటి వనరుల నిర్వహణ సరిగా లేకపోవడం భారతదేశంలో నీటి కొరతకు ప్రధాన కారణం. జూన్ 2019లో విడుదల చేసిన నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, భారతదేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2030 నాటికి దాదాపు 40% జనాభాకు తాగునీరు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు నీటి సంక్షోభం కారణంగా 2050 నాటికి భారతదేశ GDPలో 6% పోతుంది అని నివేదిక చెబుతోంది.
ఈ సమస్యలను అధిగమించడానికి వర్షపు కేంద్రాల ఏర్పాటు జరుగుతుంది. 2024 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే లక్ష్యంలో భాగంగా దేశంలోని వర్షపునీటిని ఒడిసి పట్టుకోవడానికి మరియు సంరక్షించడానికి మరియు నీటి వనరులను పునరుద్ధరించడం జరుగుతుంది.
ప్రధాన అంశాలు:
వర్షపు నీటి సంరక్షణ
సాంప్రదాయ మరియు ఇతర నీటి వనరులు/ట్యాంకుల పునరుద్ధరణ
బోర్ వెల్ నిర్మాణాలను పునర్వినియోగించడం
వాటర్‌షెడ్ అభివృద్ధి
జల శక్తి అభియాన్ వివిధ జిల్లాల కోసం నీటి సంరక్షణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, నీటిపారుదల కోసం సమర్థవంతమైన నీటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా మంచి పంటలను ఎంచుకోవడానికి కూడా దోహదపడుతుంది.
మరిన్ని చదవండి
Share your comments