News

పొటాష్ సరఫరా కోసం ఇజ్రాయెల్ కెమికల్స్ లిమిటెడ్ తో భారత్ ఒప్పందం.

S Vinay
S Vinay

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ,కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ విభాగం లో ఉన్న ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (IPL), ఇజ్రాయెల్ కెమికల్స్ లిమిటెడ్ (ICL)తో పోటాష్ సరఫరా కొరకు గాను ఒప్పందాన్ని చేసుకుంది. పూర్తి వివరాలు చూసినట్లయితే.


న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ మన్సుఖ్ మాండవియా మరియు ఇజ్రాయెల్ కెమికల్స్ లిమిటెడ్ గ్లోబల్ ప్రెసిడెంట్ ఎలాడ్ అహరోన్సన్ పాల్గొన్నారు. వీరి సమక్షంలోనే  పోటాష్ సరఫరా కి సంబందించిన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 2022 సంవత్సరం నుండి 2027 సంవత్సరం వరకు పోష్ సరఫరా అవుతుంది ప్రతి సంవత్సరానికి సుమారుగా 6 నుండి 6.5 లక్షల మిలియన్ టన్నుల పోటాష్ భారత్ కి సరఫరా అవుతుంది.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మదవియా మాట్లాడుతూ 'భారత్ మరియు ఇజ్రాయెల్ పరస్పర సహకారం తో ఆర్థిక, రక్షణ మరియు వ్యూహాత్మక సంబంధాన్ని పంచుకుంటున్నాయి.భారతదేశంలో వ్యవసాయ రంగం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. ఎరువుల పరిశోధన రంగంలో భారతదేశం మరియు ఇజ్రాయెల్ కలిసి పని చేయాలి, తద్వారా ఇది వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుస్తుంది.' అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇది వ్యవసాయ రంగంలో ఒక ముఖ్యమైన అడుగు అని వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తు రైతుల జీవితాలను మెరుగుపరుస్తుంది. అని వాఖ్యానించారు.

"పొటాష్ ఫర్ లైఫ్:
ఇజ్రాయెల్ కెమికల్స్ లిమిటెడ్ (ICL) మరియు ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (IPL) బాగస్వామ్యమై "పొటాష్ ఫర్ లైఫ్" పేరుతో వ్యవసాయం లో ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచి రైతులు ఆదాయాన్ని పెంచడంపై ద్రుష్టి సారించింది.

ఈ ఒప్పందం వల్ల పోటాష్ ఎరువుల కొరత సమస్యని అధిగమించవచ్చు. పండ్ల తోటల పెంపకంలో పోటాష్ ఎరువు అధికంగా వినియోగించబడుతుంది, వ్యవసాయ రంగంలో ఉత్పత్తితో పాటు ఉత్పాదకతని పెంచవచ్చు.

మరిన్ని చదవండి.

వ్యవసాయ చట్టాల రద్దు వద్దు .... సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక!

Share your comments

Subscribe Magazine