ఒక వైపు ఎండ మరో వైపు వానలు తెలంగాణాలో భిన్న వాతావరణం నెలకొంది , పగలు దంచి కొడుతున్న వానలు రాత్రికి అయితే వర్షాలు కురుస్తున్నాయి ,నిన్న ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రేటర్‌లోని జీడిమెట్ల, లంగర్‌హౌస్ ప్రాంతంలో 2.3సెం.మీల గాయత్రీ నగర్‌లో అత్యధికంగా 3.3సెం.మీలు, చొప్పున వర్షపాతం నమోదైనట్లు వర్ష పాతం నమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు .
మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడ మీదుగా అంతర్గత కర్ణాటక, తమిళనాడు వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పటు హైదరాబాద్ లో మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది .
ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రేషన్ కార్డ్ కొత్త నిబంధనలు..కేంద్రం నిర్ణయంతో ప్రజలకు తీపి కబురు
ఇప్పటికే మండిపోతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న జనానికి నిన్నటి వర్షాలతో కాస్త ఉపశమనం కల్గుతుంది .
Share your comments