News

మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండి అలర్ట్‌

Gokavarapu siva
Gokavarapu siva

వర్షపాతం మరియు నీటి కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక గ్రామాల వాసులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న ఏపీకి చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ, అలెర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ.

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అల్లూరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది.

వర్షాధార పంటలపై ఈ వర్షాలు సానుకూల ప్రభావం చూపుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వివిధ జిల్లాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా, దోర్నాల మండలంలో ఉన్న చిన్న గుడిపాడులో గ్రామస్తులు వర్షం కోసం గంగమ్మ తల్లిని వేడుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఇది కూడా చదవండి..

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ కొత్త విన్నింగ్ ఫార్ములా ఇదే..!!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం మంచు కురుస్తున్నప్పటికీ, ఉష్ణోగ్రతలు రోజంతా ఎక్కువగానే ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలో కూడా, ప్రజలు వేడిని ఎదుర్కోవడానికి ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, కూలర్లు మరియు ఫ్యాన్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. రాబోయే వర్షాలు ఈ పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగిస్తుందో లేదో చూడాలి.

మరొకవైపు, రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, దాని ప్రభావంతో నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ఇది కూడా చదవండి..

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ కొత్త విన్నింగ్ ఫార్ములా ఇదే..!!

Share your comments

Subscribe Magazine

More on News

More