News

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ కొత్త విన్నింగ్ ఫార్ములా ఇదే..!!

Gokavarapu siva
Gokavarapu siva

అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో సీఎం జగన్ తన రాజకీయ యంత్రాంగాన్ని సమీకరించడంలో, జనంతో మమేకం కావడంలో నిమగ్నమైయ్యారు. వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా ఎన్నికల ముందే వరాల ప్రకటనకు భారీ కసరత్తు జరుగుతోంది.

చంద్రబాబు జైలుకెళ్లిన నేపథ్యంలో, ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు పొత్తుల చర్చల్లో నిమగ్నమైనందున, తమకు అనుకూలమైన స్థానాన్ని పొందాలనే లక్ష్యంతో కీలకమైన కార్యక్రమాలను ఆవిష్కరించే అవకాశాన్ని జగన్ ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ జనాన్ని తనవైపు తిప్పుకునేందుకు జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ఇప్పటి వరకు రూ 2.45 లక్షల కోట్ల మేర సంక్షేమం ప్రజలకు అందినట్లు అధికారికంగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సంక్షేమ ఎజెండాపైనే ఎన్నికల ఫలితాలు ఎక్కువగా ఆధారపడే కీలక సమయంలో టీడీపీ తమ సంక్షేమ మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. కానీ, ఆశించిన ఆదరణ కనిపించలేదు.

ఇది కూడా చదవండి..

ప్రజలను వణికిస్తున్న ఉల్లి ధర.. కిలో ఎంతంటే?

దీంతో సంక్షేమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ వ్యూహంలో భాగంగా, వచ్చే ఏడాది జనవరి నుండి పెన్షన్ మొత్తాన్ని రూ. 3 వేలకు పెంచుతారు, అదే సమయంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నిధులను సకాలంలో బదిలీ చేసేలా చక్కటి నిర్మాణాత్మక ప్రణాళికను రూపొందించారు.

ఈ అంశాలతో పాటు, రుణ మాఫీని అమలు చేయడం వంటి కీలకమైన నిర్ణయాలను తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లో షరుతులు పెట్టి..పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇప్పుడు తాను చెప్పిందే చేస్తానని...చేసేదే చెబుతానంటూ రైతు రుణమాఫీ విషయంలో జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తిగా పాజిటివ్ ఓట్ ను నమ్ముకున్న జగన్..ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎన్నికల వేళ సంచలనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి..

ప్రజలను వణికిస్తున్న ఉల్లి ధర.. కిలో ఎంతంటే?

Related Topics

jagan new formula elections

Share your comments

Subscribe Magazine