తెలంగాణలో గత మూడు రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి .. తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో గత మూడు రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి .. తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలు మరో రెండు రోజులు పటు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో మూడు రోజులు ఉండనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ నెల 16 న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం
ఇక జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Share your comments