మసాలాల్లోను, మరియు అనేక రకాల వంటకాలోను అధికంగా ఉపయోగించే వెల్లులి, ఇప్పుడు సామాన్యుడికి కంటతడి పెట్టిస్తుంది . తరచు 100-200 రూ ఉండే వెల్లులి ఇప్పుడు ఏకంగా 300-400 రూ పలుకుతుంది. ప్రీమియం క్వాలిటీ వెల్లులి ధర 500-700రూ మధ్యలో ఉంది. పచ్చళ్ళు సీసన్ దగ్గరలో ఉండటం , మరియు పోయిన సంవత్సరం అకాల వానలు వాళ్ళ పంట నష్టం ఈ పరిస్థితికి దారి తీసింది అని చెప్పవచ్చు.
ఇండియలో వెల్లులి సాగు :
ప్రపంచ వెల్లుల్లి సాగులో భారత దేశం రెండవ స్థానంలో ఉండగా, చైనా మొదటి స్థానం లో ఉంది.. మన దేశంలో ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ సాగు చేస్తారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉత్పత్తి 2.2 మెట్రిక్ టన్నులు ఉంది, ఇది ఆ ముందు సంవత్సరం(2020-21= 3.3 మిలియన్ టన్నులు )కంటే తక్కువ. ప్రతి ఒక్కరి వంటగదిలో వెల్లులికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శరీరానికి అవసరం అయ్యే యాంటీబోడీలు, యాంటీఆక్సిడాంట్లు పుష్కలంగా ఉంటాయి , శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించండంలోను ఎంతగానో సహాయపడుతుంది. అంతే కాకుండా జలుబు, దగ్గును నియంత్రిచడంలోను వెల్లులిని వాడుతూ ఉంటారు. అనేక ఔషధ గుణాలు కలిగిన వెల్లులి సాగుకు కూడా పెట్టుబడి ఎక్కువే. ఇక్కడ పండిన వెల్లుల్లి, మలేసియా, థాయిలాండ్, వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది.
ఈ ఆర్టికల్ చదవండి..
ధాన్యం కొనుగోలుకు 11,200 కోట్ల రూపాయిలు ప్రకటించిన యోగి ప్రభుత్వం
వెల్లుల్లి కొరతకు కారణాలు:
మన దేశంలో ఊహించినరీతిలో ఉత్పత్తి లేకపోవడం, ఇతర దేశాల్లో, అధిక డిమాండ్ ఉండటం వల్ల, రైతులు పొరుగు దేశాలకు అధికంగా ఎగుమతి చేస్తున్నారు. దీని మూలంగా మన దేశంలో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం సమగ్రకార్యాచరణ జరిపి, ఎగుమతుల్లో పరిమితిని విధించడం మూలాన రాబోయే రోజుల్లో ధరలు నియంత్రించే వీలు ఉంటుంది. ఇప్పటికే బియ్యం, గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, పెరుగుతున్న వెల్లుల్లి ధరను నియంత్రించి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి.
Share your comments