News

ధాన్యం కొనుగోలుకు 11,200 కోట్ల రూపాయిలు ప్రకటించిన యోగి ప్రభుత్వం

KJ Staff
KJ Staff

ఉత్తర్ ప్రదేశ్ తమ పండించే వివిధ రకములైన ఆహార ధాన్యాలకు, కాయ గూరలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. కాగా ఈ మధ్య కాలంలో రైతులు తాము పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధరను ఇవ్వాలి అని ధర్నా చేసారు. దీనికి స్పందించిన యోగి ప్రభుత్వం 11,200 కోట్ల రూపాయిలు ధాన్యం సేకరణకు కేటాయించింది
.

Photos Source (pintrest)
Photos Source (pintrest)

ధాన్యం ఉత్పత్తికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం పేరు మోసింది. ప్రతి ఏటా సుమారు 12.5 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇది దేశం మొత్తం పండించే ధాన్యంలో 11% శాతంతో సమానం. రైతులు తాము పండించే ధాన్యానికి మంచి ధర లభించాలి అని తమ నిరసన వ్యక్తం చేసారు. దినికి స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు మొత్తం 11,200 కోట్లలు ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వ ఏజెన్సీలు , ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా తో కలసి 5.3 మిలియన్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చెయ్యగా 2.7 టన్నుల ధాన్యం సేకరించవలసి ఉంది. ధాన్యం లో సాధారణ రకాలకు క్విటా కు 2,183రూ గాను, ఏ-గ్రేడ్ రకం ధాన్యానికి క్విటా 2,203రూ గాను ప్రభుత్వం నిర్ణయించింది.

ధాన్యం సేకరణలో లోటు పాట్లను సరిచేసుకోవాలి అని మరియు రుసుము సరైన సమయం లో చెల్లించాలి అని యోగి అధికారులకు సూచించారు. ఎటువంటి అవకతవకలను సహించేది లేదు అని యోగి తేల్చి చెప్పారు. రైతుల అభ్యున్నతికి, వికాసానికి, తమ ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుంది అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

ముఖ్యమైన సహకారాన్ని అందిస్తున్న షుగర్ మిల్స్:

ధాన్యం తో పాటు చెరుకు సాగులో కూడా ముందు ఉన్న ఉత్తర్ ప్రదేశ్, అక్కడ షుగర్ మిల్స్ కు ఎంతో ప్రసిద్ధి . ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 120 షుగర్ మిల్స్ ఉండగా, 93 ప్రైవేట్ సంస్థలకు, 24 కోపెరేటివ్ లకు, 3 రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి. మొత్తం 6 మెట్రిక్ టన్నుల చెక్కర ఉత్పత్తి తో దేశ వ్యవసాయ రంగంలో భిన్నమైన పాత్ర పోషిస్తుంది. 2016-17 గణాంకాల ప్రకారం అప్పుడు 2.05 మిలియన్ హెక్టార్ల భూమి చెరుకు ఉత్పత్తిలో ఉండగా, 2023-24  3 మిలియన్ హెక్టార్లగా ఉంది . రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం చెక్కర ఉత్పత్తి లో అగ్రగామి గ ఉంటుంది అని ఆశిస్తున్నారు

Bird flu outbreak in Telugu states: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ... పౌల్ట్రీ రైతులకు భారీ నష్టం

Share your comments

Subscribe Magazine