News

పాత రూ.500, 1000నోట్లపై మార్పుపై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Srikanth B
Srikanth B

దేశంలో అప్పటికే చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నవంబర్ 2016 కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. అయితే కొందరు కొన్ని కారణాల వాళ్ళ ఇప్పటికి నోట్లను మార్చుకోలేదు , దీనిపై తాజాగా సుప్రీమ్ కోర్టు కూడా 2016 నాటి నోట్ల మార్చుకునే మరో అవకాశం లేదంటూ స్పష్టం చేసింది , అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా RBI పాత రూ.500, 1000 నోట్లు మార్చుకోవడానికి మరో అవకాశం కల్గించిందని ఒక సర్కులర్ చక్కర్లు కొడుతుంది .

దేనిపై స్పందించిన PIB ఈ పోస్ట్‌ బాగా వైరల్ అవుతుండడంతోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్ గురించి ట్వీట్ చేస్తూ, విదేశీయులకు భారతీయ కరెన్సీ నోట్లను మార్చుకునే సదుపాయం 2017లో ముగిసిందని.. 500, 1000 నోట్ల మార్పిడికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB ఫాక్ట్ చెక్) బృందం ఈ విషయాన్ని విచారించింది. దానిపై అసలు నిజాలను వెలుగులోకి తెచ్చింది. 500-1000 పాత నోట్లను విదేశీ పౌరులకు మార్చుకునే సదుపాయాన్ని పొడిగించాలనే వాదన నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం.... హైదరాబాద్ లో 24 గంటలూ ఇవి ఓపెన్‌!


మీకు కూడా ఇలాంటి వార్తలు వస్తే చూసి మోసపోవద్దు , పాత రూ.500, 1000 మారుస్తాం అంటూ కమిషన్ కొట్టేసే వాళ్ళు లోకపోలేదు కావున ప్రజలు సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వస్తే నిజ నిర్దారణ చేసుకోవాలి .

తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం.... హైదరాబాద్ లో 24 గంటలూ ఇవి ఓపెన్‌!

Share your comments

Subscribe Magazine

More on News

More