News

తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం.... హైదరాబాద్ లో 24 గంటలూ ఇవి ఓపెన్‌!

Srikanth B
Srikanth B

 


తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది రాష్ట్రంలో 24 గంటలపాటు దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ 24 గంటల పాటు తెరిచి ఉంచు కోవచ్చనే కొత్త నిబంధనను తీసుకు వచ్చింది తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988ను సవరిస్తూ సెక్షన్ 7 ప్రకారం లైసెన్సు తీసుకున్న దుకాణాలు ఏవైనా ఇక నుంచి 24 గంటలు తెరిచే ఉంచేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనితో రాష్ట్ర వ్యాపారులు తమ దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ ను 24 గంటల పాటు ఒపెన్‌ ఉంచవచ్చు . దీనికోసం అదనంగా ప్రతి సంవత్సరం రూ. 10 వేలు రుసుమును ప్రభుత్వానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది .

 

ప్రభుత్వం దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ యజమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు , ఇప్పుడు షాపులు పోలీసులు వస్తారని తొందరగా మూసివేయవల్సిన అవసరంలేదు , ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు అదనంగా రూ . 1000 చెల్లిస్తే సరిపోతుంది ,ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. అటు దుకాణాదారులకు వ్యాపారం పెరగటంతో పాటు కస్టమర్లకు కూడా ఏ సమయంలోనైనా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ విశ్వా నగరాల సరసన చేరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు .

బ్యాంకు లోన్ ఇవ్వాలేదని రైతు ఆత్మహత్య ..

సెక్షన్ 7 ప్రకారం లైసెన్సు తీసుకున్న దుకాణదారులు ఎవరైనా ఇక నుంచి 24 గంటలు తెరిచే ఉంచేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రతి రోజు 24 గంటల పాటు ఒపెన్‌ ఉండవచ్చు. ఈ మేరకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు ఏప్రిల్ 4 న విడుదల చేయగా .. ఏప్రిల్ 8 నుంచి అమలు లోకి రానున్నది .

బ్యాంకు లోన్ ఇవ్వాలేదని రైతు ఆత్మహత్య ..

Related Topics

Telangana Govt

Share your comments

Subscribe Magazine