News

బ్యాంకు లోన్ ఇవ్వాలేదని రైతు ఆత్మహత్య ..

Srikanth B
Srikanth B
Maharashtra Farmer commits suicide
Maharashtra Farmer commits suicide

అహర్నిశలు కష్టపడే ఒక రైతు తన కొడుకుని డాక్టర్ చేయాలనుకున్నాడు , అనుకున్న విధంగానే కొడుకుని (BHMS
బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) లో చేర్పించాడు అయితే మొదటి సంవత్సరం తన దగ్గర వున్నా బంగారాన్ని కుదవ పెట్టి ఫీజు చెల్లించిన రైతు రెండో సంవత్సరం ఫీజు కోసం బ్యాంకులో లోన్ కు దరఖాస్తు చేసుకున్నాడు సంవత్సరం దాటినా బ్యాంకు అధికారులు పాటించుకోకపోవడంతో కుమారుడి విద్య కోసం ఫీజు కట్టలేక పోతున్నాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు .

 

మహారాష్ట్ర : కొల్హాపూర్ జిల్లా పిసాత్రి గ్రామానికి చెందిన రైతు మహదేవ్ పాటిల్ తన కొడుకును డాక్టర్‌ని చేయాలని కలలు కన్నాడు దానిలో భాగంగానే బాలుడిని BHMS (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) కోసం జైసింగ్‌పూర్‌లోని కళాశాలో చేర్చారు. ఇంటి అవసరాలకు తీర్చడంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మహదేవ్ పాటిల్ బ్యాంకులో విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు ,ఒక సంవత్సరం గడిచిన లోన్ రాకపోవడంతో మొదట తన దగ్గర వున్నా బంగారని అమ్మి ఫీజు చెల్లించాడు , రెండో సంవత్సరం ఫీజుకైనా బ్యాంకు నుంచి లోన్ వస్తాదని భావించిన అధికారులు నిర్లక్ష్యం చేయడం తో వైద్య విద్యను అభ్యసిస్తున్న కుమారుడికి ఫీజు కట్టేందుకు సకాలంలో డబ్బులు రాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైతులకు బ్యాంకు రుణాలు అందకుండా చేస్తే.. రైతుల పిల్లలు ఎలా నేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ,హైదరాబాద్‌కు మరో రెండు రోజులు వర్షసూచన!

పైగా ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా చంద్రకత్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సొంత జిల్లా కొల్లాపూర్‌లోనే ఈ తరహా వ్యవహారం వెలుగులోకి రావడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ,హైదరాబాద్‌కు మరో రెండు రోజులు వర్షసూచన!

Share your comments

Subscribe Magazine