News

మీదగ్గర రూ.2000 నోట్లు ఉన్నాయా అయితే.... అయితే ఆ రోజు నో ఎక్స్చేంజి....

KJ Staff
KJ Staff

క్రిందటి సంవత్సరం మే నెల నుండి 2,000 రూ. నోట్లను కేంద్రం బ్యాన్ చేసిన విషయం మనందరికీ తెలిసినదే. చలామణిలో రెండువేల నోట్లను బ్యాంకు నుండి ఎక్స్చేంజి చేసుకునే అవకాశం ఆర్బిఐ కల్పించింది అయితే రెండు వేల రూపాయల నోట్ల విషయంలో రిజర్వు బ్యాంకు మరొక్క కీలక ప్రకటన చేసింది. మరో రెండు రోజుల్లో కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలవ్వనుంది, కనుక ఏప్రిల్ 1 న రెండువేల నోట్లను బ్యాంకులలో మార్చుకునేందుకు కానీ, డిపోసిట్ చేసేందుకు కానీ అనుమతించరాదని నిర్ణయించింది.

భారత దేశం మొత్తం మీద ఉన్న 19 బ్రాంచులలో, రెండువేల రూపాయిల నోట్లు మార్చుకునేందుకు మరియు డిపోసిట్ చేసందుకు కుదరదని ఆర్బిఐ ప్రకటించింది. కొత్త సంవత్సరానికి, వార్షిక ఖాతాలను ముగిస్తున్న కారణంగా, బ్యాంకులు ఏప్రిల్ 1న రెండువేల రూపాయిల నోట్లు నిరాకరిస్తున్నట్లు తెల్సుతుంది. అయితే ఏప్రిల్ రెండు నుండి ఈ లావాదేవీలు యధావిధిగా కొనసాగనున్నాయి.

గత ఏడాది నుండి, ఆర్బిఐ వ్యక్తులు, మరియు వ్యాపార సంస్థలు, తమ బ్యాంకులలో పాత రెండువేల రూపాయిల నోట్లు జమ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. కానీ ఏప్రిల్ ఒకటిన వార్షిక ఖాతాల ముగింపు కారణంగా తాత్కాలికంగా ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 2018 లో రెండు వేల రూపాయిల నోట్లు మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడు వాటి విలువ మూడున్నర లక్షల కోట్లు, అయితే ఈ ఏడాది మార్చ్ 1 నాటికీ మార్కెట్లో చలామణిలో ఉన్న రెండువేల నోట్లలో 97.62 శాతం బ్యాంకులకు తిరిగివచ్చాయని ఆర్బిఐ పేర్కొంది.

Share your comments

Subscribe Magazine

More on News

More