News

కొవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయి దొంగగా మారిన సాఫ్ట్వేర్ ఇంజనీర్

KJ Staff
KJ Staff

2019 లో వచ్చిన కోవిడ్ వైరస్ ప్రపంచం మొత్తం అల్లకల్లోలం సృష్టించింది. ఎంతో మంది ప్రాణాలను భలి తీసుకోవడమే కాక, చాల మంది తమ జీవనోపాధి కోల్పోయేలా చేసింది. ముఖ్యంగా కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు ఆదాయం పూర్తిగా తగ్గిపోయి, ఖర్చులు తగ్గించుకోవడానికి ఎంతో మంది ఉద్యోగులను విధుల నుండి తొలగించారు.

కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఒక మహిళా దొంగగ మారింది. నోయిడా కు చెందిన 26 ఏళ్ల, జస్సి అగర్వాల్ ఉద్యోగం నిమిత్తం బెంగుళూరుకు వెళ్ళింది. కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన జస్సి అగర్వాల్ , మరొక్క ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా దొంగగ మారింది. ఆమె ఉంటున్న పీజీ లో ఇతరుల లాప్ టాప్లు చోరీ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయించడం మొదలుపెట్టింది.

ఇప్పటివరకు 10 లక్షల విలువైన, 24 లాప్ టాప్లు దొంగిలించింది. కలిగే ఉండే రూముల్లోకి వెళ్లి ఛార్జింగ్ పెట్టిన లాప్ టాపులు దొంగలించేది. పీజీలో మరొక్క విద్యార్థి కంప్లైంట్ ఇవ్వడంతో, పోలీసులు రంగంలోకి దిగి, అసలు గుట్టు కనిపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జస్సి అగ్రవాల్ ని పట్టుకొని 24 లాప్ టాపులు ఆమె దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నారు.

Share your comments

Subscribe Magazine