పెరుగుతున్న మిర్చి ధరలు రైతులను సంతోషాన్ని ఇచ్చేవే .. ఆశర్నిశలు శ్రమించి పంట పండించిన రైతుకు తగిన ధర వచ్చినప్పుడు కలిగే అంనందం అంత ఇంత కాదు .. అదే ఊహించిన దానికంటే అధిక ధర లభిస్తే ఇప్పుడు మనం అలంటి ఒక రైతు గురించి తెలుసుకుందాం !
కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ఎండుమిర్చి క్వింటా గరిష్ఠ ధర రికార్డు స్థాయిలో రూ.48,299 పలికింది. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే రైతు 3.62 క్వింటాళ్ల ఎండుమిర్చి విక్రయానికి తీసుకొచ్చారు. ఆయన తెచ్చిన మిరప ఉత్పత్తులు బ్యాడిగ రకం కావడం, సరకు నాణ్యంగా ఉండటంతో వ్యాపారులు క్వింటా రూ.48,299 రికార్డు ధరకు కొనుగోలు చేశారు. కర్నూలు మార్కెట్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డు ధర కావడం విశేషం .
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం తేజా రకం మిర్చి క్వింటాకు ధర రూ.21,800గాపలికింది . సోమవారం రూ.21,600గా ఉన్న ధర ఒకే రోజులో రూ.200 మేర పెరగడం విశేషం. ప్రస్తుత సీజన్‌తో పాటు పంట సీజన్లలో దేశంలోనే ఈ ధర అత్యధికమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మిర్చి రైతుల కష్టాలు.. భారీగా కమిషన్ వసూలు చేస్తున్న ఏజెంట్లు..
పెరుగుతున్న తెగుళ్ల దాడి దీనితో దిగుబడి పై తీవ్ర ప్రభావం పడడంతో మార్కెట్టుకు వచ్చే మిర్చి తగ్గింది దీనితో దళారుల మధ్య పోటీ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి అంటే కాకూండా తేజ రకం మిర్చికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉండడం కూడా కారణం , భారతదేశం నుంచి ప్రధానంగా చైనా నుంచి ఎగుమతిదారులకు ఆర్డర్లు వస్తుండగా, వ్యాపారులు పోటీ పడి ధర పెంచుతున్నారు.దీనితో రైతుకు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అయ్యే అవకాశం ఉండడంతో రైతులు హర్షం వ్యకతం చేస్తున్నారు .
ప్రస్తుత సీజన్లో మార్కెట్ అంచనా ప్రకారం ఇదే గరిష్ట ధరగా మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు .
Share your comments