News

మిర్చి రైతుల కష్టాలు.. భారీగా కమిషన్ వసూలు చేస్తున్న ఏజెంట్లు..

Gokavarapu siva
Gokavarapu siva

జాతీయంగా మరియు అంతర్జాతీయంగా మిర్చి పంటకు డిమాండ్ భారీగా ఉంది. ఇందువలన ఇక్కడ రైతులు ఎక్కువ స్థాయి మిర్చిని సాగు చేశారు. ఇక్కడ రైతులు పండించిన పంటను ఉమ్మడి జిల్లాలోని వరంగల్‌, మహబూబాబాద్‌, కేసముద్రం మార్కెట్లలకు అమ్మకానికి విక్రయిస్తారు. కానీ ఇక్కడ మార్కెట్లో ఈనామ్‌ పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు అని రైతులు బాధ పడుతున్నారు. ఈ మార్కెట్లో కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారుల హవా నడుపుతున్నారు.

ఇక్కడ ఈనామ్‌ పూర్తి స్థాయిలో అమలు ఐతే కూలీ ఛార్జీలు మినహా రైతు ఇతరులకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈనామ్‌ అమలు చేస్తున్నామని చెబుతున్న మార్కెట్లలో కేవలం టెండర్లకు మాత్రమే పరిమితం కావడంతో దోపిడీ ఎప్పటిలాగే కొనసాగుతోంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో మిర్చి పంటను తామెర పురుగు, వైరస్‌ ఆశించినందున పంట దిగుబడి తగ్గిపోయింది.

సాధారణంగా ఇక్కడ ఎకర మిర్చి పంట నుండి 0 క్వింటాల్లా దిగుబడి అనేది వస్తుంది, కానీ ఈ సంవత్సరం ఈ చీడపురుగులా కారణంగా
ఎకరాకు సరాసరి 10 క్వింటాలుకు మించి దిగుబడి రాలేదు. దీనితోపాటు మిర్చి సాగుకు పెట్టుబడి ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. ఇక్కడ సుమారుగా ఒక ఎకరా మిర్చి సాగుకు రూ.1.80 లక్షలు ఖర్చు పెట్టారు.

ప్రస్తుతం మార్కెట్‌లో మిర్చి క్వింటాలుకు సరాసరి రూ.20 వేలు పలుకుతుంది. పండిన 10 క్వింటాలు విక్రయిస్తే పెట్టుబడి ఖర్చులు పోగా రూ.10నుంచి రూ.20వేలు మిగులుతాయనే ఆశతో రైతులు మార్కెట్‌కు వెళ్తున్నారు. అలా ఆశతో వెళ్లిన రైతులకు నిరాశే మిగులుతుంది. ఇక్కడ వ్యాపారులు కమీషన్‌, నగదు అని రైతులకు మిగిలే కొన్ని డబ్బుల్లో కూడా కోతలు కోసి వారిని నిలువుగా దోపిడీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

IRCTC కొత్త సేవలు.. ఇప్పుడు కేవలం వాయిస్ ద్వారా టికెట్ బుకింగ్..

ఉదాహరణకు మిర్చి ధర క్వింటాలుకు రూ.20 వేల చొప్పున 10 క్వింటాళ్లు విక్రయిస్తే ఆ రైతుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో హమాలీ, కూలీ చార్జీలు మినహాయించుకొని మిగిలినవి ఇవ్వాలి. కాని వ్యాపారులు రూ.లక్షకు రూ.4 వేల చొప్పున మొత్తం రూ.8 వేలు కోత పెడుతున్నారు. రైతుకు పెట్టుబడి, ఖర్చులు పోను రూ.8వేలు కూడా మిగలక పోవడం గమనార్హం.

ఇక్కడ ఒక రైతు ఒక ఎకరంలో మిర్చి సాగు చేసాడు. ఈ పంటను సాగు చేయడానికి ఆ రైతుకు రూ.1.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 8.34 క్వింటాళ్ల పంటను మార్కెట్కు విక్రయించగా ఆయనకు రూ.1,64,798 చెల్లించాల్సి ఉండగా అందులో కమీషన్‌ పేరిట రూ.4,943, నగదు పేరుతో రూ.3295 మొత్తం రూ.8,238 కోత విధించి మిగిలిన డబ్బులు చెల్లించారు. దీనితో ఈ రైతు సాగు ఖర్చు పోగా ఏమి మిగలలేదని ఆవేదం వ్యక్తం చేసాడు.

ఇది కూడా చదవండి..

IRCTC కొత్త సేవలు.. ఇప్పుడు కేవలం వాయిస్ ద్వారా టికెట్ బుకింగ్..

Related Topics

chilli crop

Share your comments

Subscribe Magazine