News

IRCTC కొత్త సేవలు.. ఇప్పుడు కేవలం వాయిస్ ద్వారా టికెట్ బుకింగ్..

Gokavarapu siva
Gokavarapu siva

రైలు టికెట్స్ బుక్ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ శుభవార్త తెలిపింది. ఇప్పుడు ఈ టికెట్ బుకింగ్ మరింత సులువు చేయడానికి ఐఆర్‌సీటీసీ సంస్థ మరో ముందడుగు వేసింది. ఇప్పుడు రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ కొత్తగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ బేస్డ్‌ వాయిస్‌ సెంట్రిక్‌ ఈ-టికెటింగ్‌ ఫీచర్‌ను వినియోగదారుల కొరకు అందుబాటులోకి తీసుకురానుంది. దీనితో వినియోగదారులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ మరింత సులువుగా మారుతుంది.

ప్రస్తుతానికి ఈ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ బేస్డ్‌ వాయిస్‌ సెంట్రిక్‌ ఈ-టికెటింగ్‌ ఫీచర్‌కు సంబంధించి తోలి దశ టెస్టింగ్ అనేది విజయవంతం అవ్విందని నివేదికలో తెలియజేసారు. ఈ ఏఐ ఫీచర్కు సంబంధించి తోలి దశ విజయవంతం కావడంతో బహుళ దశ టెస్టింగ్‌ను ఐఆర్‌సీటీసీ మరింత వేగవంతం చేయనుంది. ఈ ఫీచర్ మరి కొద్దీ రోజుల్లోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఇదివరకటిలా ఐఆర్‌సీటీసీ యాప్ లాగిన్ చేయడానికి ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీలతో మనకు పనిఉండదు. కేవలం మన వాయిస్ ఉపయోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు మీ వివరాలకు బదులుగా 'యాక్చువల్లీ' అనే పదం చెబితే చాట్ మొదలు అవుతుంది. దీనిలో కావలసిన మార్పులను ఆస్క్ దిశ పరీక్షిస్తుంది.

ఈ ఏఐ ఫీచర్ ద్వారా ఐఆర్‌సీటీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఈ ఏఐ ఫీచర్ అనేది వినియోగదారులకు వచ్చే మరో మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఐఆర్‌సీటీసీ ప్రయత్నిస్తుంది.

ఇది కూడా చదవండీ..

బిర్యానీ ఏటీఎం వచ్చేసింది!

ప్రయాణికులు ఈ ఐఆర్‌సీటీసీ తీసుకువచ్చిన ఫీచర్ ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడమే కాదు అవసరమైతే ఆ టిక్కెట్లను రాదు కూడా చేసుకోవచ్చు. వినియోగదారులు ఈ ఏఐ తో చాట్ చేయడానికి 'యాక్చువల్లీ' అనే పదంతో మొదలుపెట్టాలి. ప్రయాణికులు దీనిని ఉపయోగించి పీఎన్‌ఎర్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. దీనితోపాటు ప్రయాణికులు వారి యొక్క బోర్డింగ్ లేదా డెస్టినేషన్ స్టేషన్‌ని కూడా సరిచేసుకోవచ్చు. దీనితో రైలు టికెట్లను ప్రివ్యూ, ప్రింట్, షేర్ కూడా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండీ..

బిర్యానీ ఏటీఎం వచ్చేసింది!

Related Topics

irctc ticket booking

Share your comments

Subscribe Magazine