News

యాపిల్ ను తలపించె రెడ్ మాంగో ఆరోగ్య ప్రయోజనాలు!

S Vinay
S Vinay

కశ్మిర్ యాపిల్ ను పోలినటువంటి ప్రత్యేక మామిండి పండ్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ ను పోలిన ఈ మామిడి యొక్క ప్రయోజనాలను తెలుసుకున్న తర్వాత, ఈ పండు పట్ల మీ ప్రేమ అనేక రెట్లు పెరుగుతుంది. ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన మామిడి పండ్లు కేవలం మన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో మాత్రమే పండుతున్నాయి. ఈ రెడ్ మ్యాంగ్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. షుగర్ కంటెంట్ తక్కువగా మరియు ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది.రెడ్ మ్యాంగోలో మంచి పోషక విలువలు ఉండడం వలన దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.ఒక్కో చెట్టుకు 30 కేజీల వరకు దిగుబడి వస్తుంది.

మామిడి ఆరోగ్య ప్రయోజనాలు:
100 గ్రాముల మామిడిలో 60 కేలరీలు ఉంటాయి. మామిడిలో విటమిన్ సి, ఎ మరియు ఇతర రకాల కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి. ఈ అన్ని ముఖ్యమైన పోషకాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.మామిడి పండ్లలో క్వెర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్వెర్‌సిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్ మరియు మిథైల్ గాలేట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మన శరీరాన్ని రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు లుకేమియా నుండి రక్షిస్తాయి.అధిక స్థాయిలో విటమిన్ సి, ఫైబర్ మరియు పెక్టిన్ ఉంటాయి, ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.ఇది జీర్ణక్రియ పనితీరును పెంచుతుంది.అధిక ఐరన్ కంటెంట్ కలిగి ఉంటుంది మామిడిలో అధిక ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల రక్తహీనత ఉన్నవారికి సహజ నివారణ. అలాగే, మహిళలు తమ శరీరంలో ఐరన్ స్థాయిని మరియు కాల్షియం కంటెంట్‌ను పెంచడానికి మామిడిపండ్లను తినాలి.

మరిన్ని చదవండి.

క్రెడిట్ కార్డు వినియోగదారులకి శుభవార్త...ఇప్పుడు క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్లు!

ఖాళీ కడుపుతో ఎప్పుడూ తినకూడని ఆహారాలు!

Related Topics

red mango mango telugu news

Share your comments

Subscribe Magazine