ఈ ఏడాది వాతావరణం అనుకూలించక బంగాలదుంపల దిగుబడిలో తగ్గుదల కనిపిస్తుంది. దిగుబడి తగ్గిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బంగాలదుంపలూ అధికంగా సాగు చేసే ఉత్తర్ ప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో అకాల వర్షాల కారణంగా పంట పంట దిగుబడిలో తగ్గుదల కనబడుతుంది.
బంగాలదుంప పెరగడానికి చల్ల వాతావరణం అవసరం. ఉత్తర భారత దేశంలో ఈ పంటను రబీ పంటగా సాగుచేస్తారు. అక్టోబర్ మొదటి మాసంలో వాతావరణ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనబడుతుంది. రైతులంతా ఇదే సమయంలో రబీ పంట పనులు ప్రారంభిస్తారు. అయితే పోయిన సంవత్సరం నవంబర్ మొదట్లో వాతావరణం అనుకూలించక, బంగాలదుంప పంట ప్రారంభంలోనే పంట నష్టానికి గురయ్యింది. దీని కారణంగా ఎంతో మంది రైతులు తిరిగి డిసెంబర్ మాసంలో కొత్త పంట ప్రారంభించవలసిన అవసరం ఏర్పడింది.
పంట ఆలస్యం కావడం మూలాన, పంటా కాలం ఏప్రిల్ వరకు పొడిగించబడింది. పంట చేతికి వస్తుందన్న సమయంలో హఠాత్తుగా కురిసిన వానలకు పంట నష్టం ఏర్పడింది. పంట అధికంగా నష్టపోయిన వారిలో ఉత్తర్ ప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్కు చెందిన రైతులే ఎక్కువ. ఈ ఏడాది బంగాలదుంపల నుండి 58.99 మిలియన్ టన్నుల దిగుబడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు, ఇది క్రిందటి సంవత్సరం 60.14 మిలియన్ టన్నుల దిగుబడి కంటే తక్కువ. దిగుబడిలో తగ్గుదల కనిపించడం మూలాన ధరల్లో పెరుగుదల ఉండొచ్చని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది.
Share your comments