News

దంచికొడుతున్న ఎండలు....విలవిలాడుతున్న జనం.....

KJ Staff
KJ Staff

తెలంగాలో ఎండలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. ఏప్రిల్ మధ్యస్తంలోనే ఇలా ఉంటె, మే నెల వచ్చే సరికి ఎండలు గగ్గోలు పెట్టిస్తామని అంచనా. ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఏప్రిల్ 18-20 మధ్యలో వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్(ఐఎండి) హెచ్చరించింది.

వేసవి కాలం మొదలవ్వడంతో ఎండలు ముదురుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం సంవత్సరంలోనే బుధవారాన్ని హాటెస్ట్ డే గా పరిగణిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నమోదయిన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి: భద్రాద్రి- 44.7 డిగ్రీలు, నల్గొండ-44.8 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల- 44.2 డిగ్రీలు, జగిత్యాల-44. డిగ్రీలు. హైద్రాబాదులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

తెలంగాణాలో పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని ఐఎండి తెలిపింది, ఆ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ హెచ్చరిక జారీచేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, ముక్యమైన పనులన్నీ ఉదయం 11 గంటల లోపు పూర్తిచేసుకోవాలని సూచిస్తుంది.

నీటి సమస్యలు:

పెరుగుతున్న ఎండలతో సమానంగా ప్రజలు నీటి కష్టాలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తాగేందుకు మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో రిజర్వాయర్లలో నీరు ఆవిరి అవుతూ వస్తుంది. ప్రజల నీటి సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. మరమ్మత్తులకు నోచుకోని బావులను, చేతి పంపులను బాగు చేసి ప్రజలకు నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. నీరు అందుబాటులో లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి నిత్యవసరాలకు నీటిని అందిస్తున్నారు.

Read More:

Share your comments

Subscribe Magazine