News

ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం..... ఆకాశంలోకి ఎగసిపడుతున్న మంటలు.....

KJ Staff
KJ Staff

తరచు భూకంపాలకు, సునామీలు గురవుతూ ఉండే దేశం ఇండోనేషియా. ప్రస్తుతం ఆ దేశంలో అగ్నిపర్వతం బద్దలై, ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు, రాతి శకలాల వలన వందలాది మంది జనం నిరాశ్రయులయ్యారు.

ఇంక వివరాల్లోకి వెళితే..... ఇండోనేసియాలోని మౌంట్ రువాంగ్ అనే అగ్నిపర్వతం ఒక్క సారిగా బద్దలయ్యింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అగ్నిపర్వతం నుండి పెద్దఎత్తున లావా మరియు భూడిద గాల్లోకి ఎగసిపడుతుంది. దీని కారణంగా అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను కాలి చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సుమారు 800 ప్రజలు అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు, అధికారులు తెలిపారు, వారిలో కొంతమంది బోట్లల్లో మరికొంత చర్చుల్లో తలదాచుకుంటున్నారు.

ఇండోనేషియా దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపసమూహారం కలిగిన దేశం. ఈ దేశం యొక్క భూగోళిక పరిస్థితుల కారణంగా నిత్యం సునామీలు భూకంపాలకు ఈ దేశం గురవుతుంది. అంతేకాకుండా ఎన్నో అగ్నిపర్వతాలకు ఈ దేశం నిలయం. ఇప్పుడు ఉప్పొంగిన మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం చాల ఏళ్ల నుండి లావా, రాతి శకలాలతో ఏర్పడుతూ వస్తుంది. ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 2002లో బద్దలై తీవ్ర నష్టాన్ని కలిగించి. తిరిగి మల్లి ఇప్పుడు సంభవించిన విస్ఫోటనం గురించిన కారణాలను శాస్త్రవేత్తలు ఆధ్యయనం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండోనేసియాలో చాలా అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి, తాజాగా 2022 లో మౌంట్ సెమెరు లోని అగ్నిపర్వత విస్ఫోటనానికి 1,900 మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని కాళీచేసి వేరేప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది, ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా ప్రణాలు కోల్పోయారు.

Share your comments

Subscribe Magazine