రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పట్టణ ప్రాంత వ్యవసాయేతర భూముల రిజిస్టర్ కాని నోటరీ పత్రాల క్రమబద్దీకరణను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన జి ఓ 84 ప్రకారం దరఖాస్తుతో పాటు నోటరైజ్డ్ పత్రాలు, లింక్ పత్రాలు, ఆస్తి పన్ను రసీదులు, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు రసీదు ఇంకేదైనా వారి అధీనమునకు సంబందించిన ఆధారాలు మీ సేవ కేంద్రాల ద్వారా సమర్పించాలని తెలిపారు.
త్వరలోనే వారికి రూ.లక్ష ఆర్ధిక సహాయాన్ని అందించనున్న ప్రభుత్వం.. ఎవరు అర్హులంటే?
125 చదరపు గజాలకు ఎటువంటి స్టాంపు డ్యూటి మరియు అపరాధ రుసుము ఉండదని అలాగే 125 చదరపు గజాలకు మించిన స్థలాలకు దరఖాస్తు చేసిన తేదీ నాటికీ ఉన్న మార్కెటు రేటు ప్రకారం స్టాంపు డ్యూటీ మరియు అదనంగా 5 రూపాయల పెనాల్టీ విధించబడుతుందని తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 31 వరకు సమర్పించాలని లేనిచో తిరస్కరించబడతాయని తెలిపారు. 3000 చదరపు గజాల లోపు స్థలం ఉన్న నోటరైజ్డ్ పత్రాలను మాత్రమే అంగీకరించబడతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ఈ పత్రాలను లింక్ డాకుమెంట్స్ గా పరిగణిస్తుందని తెలిపారు.
Share your comments