News

త్వరలోనే వారికి రూ.లక్ష ఆర్ధిక సహాయాన్ని అందించనున్న ప్రభుత్వం.. ఎవరు అర్హులంటే?

Gokavarapu siva
Gokavarapu siva

రాష్ట్రంలోని ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆకర్షించడానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న సంగతి మనకి తెలిసిన విషయమే. తాజాగా రాష్ట్రంలోని మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు రూ. లక్ష ఆర్ధిక సహాయాన్ని అందించనుంది. అయితే 100 శాతం సబ్సిడీతో ప్రభుత్వం మైనార్టీలకు ఆర్థిక సాయం అందిస్తోంది.

ఈ పథకం యొక్క మొదటి దశలో భాగంగా ఆగస్టు 19న మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. ప్రస్తుతం రెండో విడత ఆర్థిక సాయం పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది, ఇందుకోసం రూ. 153 కోట్లు ఇప్పటికే కేటాయించారు. మైనార్టీలకు రెండో విడత ఆర్థిక సాయం పంపిణీనికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం 120 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి రూ. లక్ష ఆర్థిక సహాయంగా అందించనుంది ప్రభుత్వం. తొలి దశలో 10 వేల మందికి రూ.లక్ష చొప్పున రూ. 100 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలోని మైనార్టీలకు రెండో దశలో భాగంగా రూ.లక్ష పంపిణి చేయనున్నారు.

ఇది కూడా చదవండి..

పీఎం కిసాన్ పథకం నుండి 81,000 మంది రైతుల పేర్లను తొలగింపు..! కారణం ఇదే?

తెలంగాణ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజల దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో కొత్త కార్యక్రమాలను తెరపైకి తెస్తోంది. ఇప్పటికే బీసీలలోని చేతి వృత్తులకు లక్ష సాయం ఇస్తుండగా... మైనార్టీలకు కూడా ఇదే తరహా స్కీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో విడత ఆర్ధిక సహాయాన్ని అందించడానికి త్వరలోనే ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. నిర్ణీత తేదీల ప్రకటన అనంతరం https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఈ పథకానికి అర్హత పొందాలంటే, ప్రజలు తప్పనిసరిగా 21 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి మరియు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు లేదా పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. ఈ పథకానికి కుటుంబానికి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరని గమనించడం ముఖ్యం. https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఇది కూడా చదవండి..

పీఎం కిసాన్ పథకం నుండి 81,000 మంది రైతుల పేర్లను తొలగింపు..! కారణం ఇదే?

Related Topics

Telangana govt Scheme cm kcr

Share your comments

Subscribe Magazine