News

రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక విడుదల...భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి!

S Vinay
S Vinay

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా వార్షిక నివేదిక విడుదలైంది.ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 వరకు జరిగిన భారత ఆర్ధిక విషయాలను ఈ నివేదిక కవర్ చేస్తుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తన వార్షిక నివేదికలో, ప్రస్తుతం ప్రపంచ ప్రమాదాలు పొంచు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు పుంజుకునే అవకాశం ఉందని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.

నకిలీ కరెన్సీ:
2020-21 ఆర్ధిక సంవత్సరంలో నకిలీ నోట్లు తగ్గుముఖం పట్టాయి కానీ 2021-22 లో నకిలీ నోట్లు 10.7 శాతం పెరిగాయి. 2021-22లో రూ.500 డినామినేషన్ నకిలీ కరెన్సీలు 102 శాతం పెరిగాయి. అలాగే నకిలీ రూ.2000 నోట్లు 55 శాతం పెరిగాయి. RBI వార్షిక నివేదిక ప్రకారం, బ్యాంకింగ్ రంగంలో గుర్తించబడిన మొత్తం నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు RBI వద్ద 6.9 శాతం మరియు దేశవ్యాప్తంగా ఇతర బ్యాంకుల వద్ద 93.1 శాతం ఉన్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం:
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అయోమయం లో ఉంది. ఎగుమతులకి పెద్ద మొత్తంలో అంతరాయం కలిగింది. యుద్ధం కారణంగా లోహాలు, ముడి చమురు మరియు ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది.

బ్యాంక్ మోసాలు:
2021-22 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకు మోసాలు సగానికి పైగా తగ్గాయని నివేదిక తెలియజేసింది.

ద్రవ్యోల్బణం:

2021-22 సంవత్సరంలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైంది.

భారత ఆర్థిక వ్యవస్థ:
రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నివేదిక ప్రకారం, దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సాపేక్షంగా మెరుగైన స్థానంలో ఉంది.

GDP:

2022-23కి GDP వృద్ధిని 7.2 శాతానికి సవరించింది. ఇది యుద్ధానికి ముందు చేసిన అంచనాల కంటే 60 బేసిస్ పాయింట్ల క్షీణత. ప్రధానంగా ప్రైవేట్ వినియోగంపై ప్రభావం చూపే అధిక చమురు ధరలు మరియు నికర ఎగుమతులు తగ్గిన అధిక దిగుమతుల కారణంగా GDP తగ్గించబడింది.


మరిన్ని చదవండి.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని తెరవండి, ప్రతి నెలా 50 వేలకు పైగా సంపాదించండి!

పోస్టాఫీస్‌ పథకం: నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టి...రూ. 35 లక్షలు పొందండి!

Share your comments

Subscribe Magazine

More on News

More