HOME LOANS:సొంతింటిని నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల, సొంతింటిని నిర్మించుకోవాలనే ఆలోచనతో ఉన్న వారందరికీ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది.
తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(RESERVE BANK OF INDIA) ప్రకటించిన తన మానిటరీ పాలసీలో గృహ నిర్మాణానికి పెద్ద పీఠ వేసింది. కరోనా మహమ్మారి సమయంలో గృహ నిర్మాణాల కోసం తీసుకొన్న నిబంధనలను వచ్చే ఏడాది మార్చ్ 2023 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని(monetary policy) విడుదల చేస్తూ, RBI గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ వ్యక్తిగత గృహ రుణాలు, గృహనిర్మాణ రంగం యొక్క ప్రాముఖ్యత మరియు దాని గుణకార ప్రభావాలను గుర్తించి, ఈ మార్గదర్శకాల వర్తింపును మార్చి 31, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
దీని వాళ్ళ గృహ రంగానికి మేలు జరగనుంది, ఇళ్లను కొనుగోలు చేసే వారికి అత్యధికంగా క్రెడిట్ ఫ్లో లభించనుంది. అదేవిధంగా వడ్డీ రేట్లను పెంచకుండా సామాన్యులపై భారం పడకుండా నిర్ణయం తీసుకుంది .ఈ నిర్ణయం వల్ల మరికొంత కాలం ఇళ్ల కొనుగోలుదారులు తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలను పొందనున్నారు.ఆర్‌బిఐ నిర్ణయంపై హౌసింగ్.కామ్, మకాన్.కామ్ మరియు ప్రాప్‌టైగర్.కామ్ గ్రూప్ సిఇఒ ధ్రువ్ అగర్వాలా మాట్లాడుతూ భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం మరింత స్థిరమైన పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తోందని ఇలాంటి విధానాలు మరింత సహాయపడతాయని అన్నారు.2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా డిమాండ్ దాదాపు 50 శాతం పడిపోయినప్పుడు పెద్ద ఎదురుదెబ్బ తగిలినా, గత సంవత్సరంలో గృహాల విక్రయాలు బాగా పెరిగాయి.
మరిన్ని చదవండి.
Share your comments