News

వ్యవసాయంలో రైతులకి తోడుగా అవుట్ గ్రో యాప్

S Vinay
S Vinay

అవుట్‌గ్రో యాప్ అనేది వ్యవసాయ రంగంలో వివిధ అంశాలపై వాస్తవికంగా ఖచ్చితమైన సమాచారాన్ని సులభంగా అందిస్తుంది.
వ్యవసాయం ప్రాథమిక వృత్తిగా ఉన్నటువంటి భారతదేశంలో రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు, కానీ నిరంతరంగా అభివృద్ధి చెందుతున్నఆధునిక సాంకేతికతతో రైతులు ఏ సమయంలోనైనా తమ సమస్యలను లేక ఫిర్యాదులను తెలియజేయవచ్చు.అవుట్‌గ్రో యాప్ ద్వారా రైతులు వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.ఇది ప్రత్యేకంగా వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. అవుట్ గ్రో యాప్ ,ప్రాంతీయంగా ఉన్న మండి/మార్కెట్ ధరలు, వాతావరణ సూచన, AI-ఆధారిత పంట ఆరోగ్యం, పంటల సమాచారం, తెగుళ్లు మరియు వ్యాధులు, భూసార పరీక్షలు మరియు వ్యవసాయ నిపుణుల సలహాలు వంటి అంశాలతో తయారుచేయబడింది.

అవుట్ గ్రో యాప్ ఫీచర్స్

సులభం మరియు సహజమైనది:
మెరుగైన మరియు సులభమైన అంశాల సమన్వయంతో రోపొందించిన ఈ యాప్ ని వాడటం చాల తేలిక.ఇన్ఫోగ్రాఫిక్స్ వినియోగంతో, అవుట్‌గ్రో ఆప్ రైతుల నాణ్యమైన సమాచారం అందించడంలో బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది.

అనేక భాషల్లో:
భారతదేశం అత్యంత వైవిధ్యభరితమైన దేశం, ప్రతి రాష్ట్రం దాని సొంత భాషని కలిగి ఉండటంతో, అవుట్‌గ్రో యాప్ ని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మరాఠీ: పూర్తిగా 6 భాషలతో ప్రారంభించబడింది.

మండి/మార్కెట్ ధరలు:
పంట కోత అనంతరం వాటిని సులభంగా అమ్మడానికి వాస్తవమైన మార్కెట్ ధరలను రైతులను అందిస్తూ అవుట్ గ్రో యాప్ మొదలయింది.

వాతావరణ సూచన:
వ్యవసాయానికి వాతావరణం ఒక కీలకమైన అంశం కాబట్టి, వాతావరణ లక్షణాలు, వర్ష సూచన, తేమ మరియు ఉష్ణోగ్రత వంటి క్లిష్టమైన సమాచారాన్ని రోజువారీగా ప్రతి గంటకి అందిస్తాయి.

పంటల పూర్తి సమాచారం:
100కు పైగా పంటలకు సంబంధించి సాగు పద్ధతుల్లో ప్రతి దశలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు పొందవచ్చు.

తెగుళ్ళు మరియు వ్యాధులు:
అవుట్ గ్రో యాప్ ఇప్పుడు 500కి పైగా తెగుళ్లు మరియు వ్యాధులు మరియు నివారణ చర్యల సమాచారాన్ని కలిగివుంది. ఇది రైతులకి సరైన సమయంలో సరైన నివారణ చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

భూసార పరీక్ష:
రైతులు నేల స్థితిని అర్థం చేసుకోవడంలో సహాయపడే ఆటోమేటిక్ సాయిల్ టెస్టింగ్ సేవలతో అవుట్ గ్రో యాప్ ప్రారంభించబడింది
దీని ద్వారా రైతులు నేల స్వభావాన్ని ముందే అంచనా వేసి తదనుగుణంగా ప్రణాలిక చేసుకోవచ్చు.

వ్యవసాయ నిపుణులు:
అవుట్ గ్రో యాప్ పప్రస్తుతం 6 భాషల్లో అందుబాటులో వుంది, ఈ ఆప్ లో ఉన్న IVR (ఇంటరాక్టివ్ వాయిస్) సహాయంతో రైతులు తమ మాతృబాష లోనే వ్యవసాయ నిపుణులతో సంభాషించడానికి సహాయపడుతుంది.

అవుట్ గ్రో యాప్ కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే డౌన్ లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ నొక్కండి  https://play.google.com/store/apps/details?id=com.waycool.iwap)

 

Share your comments

Subscribe Magazine