News

తెలంగాణ: రైతులకు శుభవార్త... రైతుబంధు డబ్బులు జమ....

KJ Staff
KJ Staff

పంటకు సాయం చేకూర్చేందుకు అందించే రైతు బందు డబ్బులు తమ ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయి అని రైతులంతా ఆశగా ఎదురుచూస్తున్న వేళా, తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న రైతు భరోసా డబ్బులను, వ్యవసాయ శాఖ విడుదల చేసింది.

ఈ ఏడాది వేసంగికి అందించవలసిన రైతుబంధు కోసం రైతులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా అనే పేరుతో ప్రతిరైతుకు ఎకరానికి 15 రూపాయిల ఇస్తామని ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల రైతు భరోసా అందించలేక, బిఆర్ఎస్ ప్రారంభించిన రైతు బందు పథకాన్నే కొనసాగిస్తున్నారు.

దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు, రాష్ట్రంలో ఐదు ఎకరారలో లోపు ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు వారి అకౌంట్లలో వేశారు. అయితే మార్చ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున, 5 ఎకరాలు పైన ఉన్న రైతులకు రైతు బందు అందించడం సాధ్యపడలేదు. అయితే రైతుల ఖాతాల్లో డబ్బు ఎప్పుడు జమచేస్తారన్న విష్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఒత్తిడి తీసుకువచ్చాయి. ఎన్నికల ప్రసారాల్లో ఇదే విష్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో విమర్శలను ఎదురుకుంది.

ఎట్టకేలకు 5 ఎకరాలు దాటి ఉన్న రైతులకు కూడా వ్యవసాయ శాఖ రైతు బందు డబ్బులు జమ చేసింది. దీని కోసం ప్రభుత్వం 2000 వేల కోట్ల రూపాయిల నిధులు కేటాయించనుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు నేరుగా జమవుతాయి.

Share your comments

Subscribe Magazine