News

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు

KJ Staff
KJ Staff

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని చోట్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల రాకతో వాతావరణం చల్లబడిందని ప్రజలు ఆనంద పడుతున్నారు, కానీ కొంతమంది రైతులకు మాత్రం ఈ వర్షాలు బాధని మిగిల్చాయి. అకాల వర్షాల కారణంగా చాల మంది రైతులు పంట నష్టపోయారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో రైతులు పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షాల మూలాన రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలయ్యింది. ఇదిలా ఉంటె కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులదీ కూడా ఇదే పరిస్థితి. ఈ కేంద్రాల వద్ద బస్తాల్లో నిలువచేసిన ధాన్యం వర్షపు నీటికి తడిసి, మొలకెత్తింది.

వర్షాలు ఎక్కువగా ఉండటంతో టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచిన లాభం లేకపోయింది. ఇంకా కొత్తకొయ్యని పొల్లాలో పంట నేలకొరిగింది. సాధారణంగా ఏప్రిల్ చివరినాటికి పంట కోత పూర్తవుతుంది, కాకపోతే కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడే వరినూర్పిళ్లు మొదలుపెట్టారు. కోత కోసిన ధాన్యాన్ని ఎండకు ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు నీటిపాలయ్యింది. తడిచిన ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వం స్పందించి, వర్షాలకు నష్టపోయిన ధాన్యం రైతులకు నష్టపరిహారం అందిస్తే, రైతులకు కొంత ఊరట లభిస్తుంది. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగులోచేసేలా చర్యలు చేపట్టాలి. మరోపక్క బలీమైన మామిడి రైతులు కూడా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది, గాలులకు చెట్లమీద పిందెలు రాలిపోయని రైతులు చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine