News

రాష్ట్రంలో నేటి వాతావరణ సమాచారం

KJ Staff
KJ Staff

నెల రోజుల నుండి అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో, వడగాల్పులతో ప్రజలు సతమతమవుతున్నారు. సూర్యుని వేడి జ్వాలల్లో మగ్గుతున్న ప్రజలకు, నేటి నుండి నాలుగు రోజుల పాటు కురవనున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించనున్నాయి.

వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం, తూర్పు విదర్భ నుండి, దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మరియు కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి సుమారు ఒక కిలోమీటర్ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉన్నట్లు సమాచారం. దీని ప్రాభవంతో రానున్న  నాలుగు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్ర,రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

ఈ వర్షాల కారణంగా వాతావరణం కాస్త చల్లబడి ప్రజలకు ఊరట లభించనుంది. ఆంధ్ర ప్రదేశం రాష్ట్రంలో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ ద్రోణి ప్రభావం వలన తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండి హెచ్చరించింది.

ఉష్ణోగ్రతలో కొంచెం తగ్గుదల కనిపించడంతో, వడగాల్పులు తగ్గుముఖం పట్టాయి. అంతకు ముందు వరకు గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా సోమవారం నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Share your comments

Subscribe Magazine