News

ఇకపై రెస్టారెంట్లు ఇష్టానుసార చార్జీలు వసూలు చేయడానికి వీలులేదు!

S Vinay
S Vinay

రెస్టారెంట్లు వినియోగదారులపై బలవంతంగా "సర్వీస్ ఛార్జీలు" వసూలు చేయడంపై వినియోగదారుల వ్యవహారాల విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

రెస్టారెంట్లు విధించే సర్వీస్ ఛార్జీకి సంబంధించిన సమస్యలను చర్చించడానికి వినియోగదారుల వ్యవహారాల విభాగం (DoCA) 2022 జూన్ 2న నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో సమావేశాన్ని షెడ్యూల్ చేసింది. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)లో వినియోగదారులు నమోదు చేసిన అనేక ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఫలితంగా ఈ సమావేశం జరగనుంది.

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడికి వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ రాసిన లేఖలో, రెస్టారెంట్లు మరియు తినుబండారాలు డిఫాల్ట్‌గా వినియోగదారుల నుండి సేవా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఎత్తి చూపారు.తరచుగా రెస్టారెంట్లు ఇష్టానుసారంగా అధిక ధరలకు నిర్ణయించిన సర్వీస్ ఛార్జీలను, వినియోగదారులు బలవంతంగా చెల్లించే విషయాన్ని లేఖలో ఎత్తి చూపారు. అటువంటి ఛార్జీల చట్టబద్ధతపై వినియోగదారులను తప్పుగా తప్పుదారి పట్టిస్తున్నారు అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించిన కింది అంశాలు చర్చించబడతాయి.

రెస్టారెంట్లు బాదుతున్న సర్వీస్ ఛార్జీలు.

రెస్టారెంట్‌లో కస్టమర్ ప్రవేశించడానికి ఛార్జీని చెల్లించడం.

కొన్ని ఇతర ఛార్జీల ముసుగులో బిల్లులో సేవా ఛార్జీని జోడించడం.

సర్వీస్ ఛార్జ్ చెల్లించే సందర్భంలో వినియోగదారులను ఇబ్బంది పెట్టడం.

హోటళ్లు/రెస్టారెంట్‌ల ద్వారా సర్వీస్ ఛార్జీని వసూలు చేయడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇప్పటికే 21.04.2017 నాటి మార్గదర్శకాలను ప్రచురించింది. రెస్టారెంట్‌లో కస్టమర్ ప్రవేశించడాన్నిసేవా ఛార్జీని చెల్లించడం భావ్యం కాదని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.వినియోగదారులకి తమ హక్కులకు భంగం కలిగినట్లైతే వివాదాల పరిష్కార కమిషన్ (Consumer Disputes Redressal Commission) ను సంప్రదించవచ్చు.

మరిన్ని చదవండి.

పిల్లల చదువుకి తల్లిద్రండులు చేస్తున్న ఖర్చు....సర్వే వివరాలు!

దేశంలో రికార్డు స్థాయిలో ప్రధాన పంటల ఉత్పత్తి!

Share your comments

Subscribe Magazine