News

Reverse dowry: ఆంధ్రలో నడుస్తున్న రివర్స్ కట్నం ట్రెండ్!కన్యాశుల్కం తిరిగి ఒచ్చిందా?

KJ Staff
KJ Staff

అమ్మాయికి సరైన సంబంధం చూసి త్వరగా పెళ్లిచేసి పంపడానికి అప్పట్లో ఆడపిల్ల తల్లిదండ్రులు ఒక యుద్ధమే చేసేవారు. అయితే ఇప్పుడు ఆ యుద్ధాలు అన్ని అబ్బాయి తరపు వాళ్ళు చేయాల్సొస్తుంది. ప్రస్తుతం పెళ్లి మార్కెట్ లో సీన్ రివర్స్ అయ్యి అమ్మాయిలదే పైచేయిగా ఉంది.

తెలుగు రాష్ట్ర జిల్లాల్లో పెళ్లికాని అబ్బాయిల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆంధ్రాలోని పెళ్లిళ్ల మార్కెట్‌లో వ్యవసాయం, సంప్రదాయ వృత్తులు, కుటుంబ వ్యాపారాలు వంటి రంగాల్లో పనిచేసే అబ్బాయిలకు పెద్దగా డిమాండ్ ఉండడం లేదు. అబ్బాయికి అంటూ స్థిరమైన ఉద్యోగం ఉండకపోతే ఎన్ని ఆస్తులు ఉన్న ఆడపిల్లలు మక్కువ చూపట్లేదు. పర్యవసానంగా, కొంతమంది అబ్బాయిలు పెళ్లి కోసం అమ్మాయిలకు రివర్స్ కట్నంను ఆఫర్ చేస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు వంటి ప్రాంతాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి:

హైదరాబాద్‌ :ఏప్రిల్లో దశాబ్దంలోనే మూడవ అత్యధిక వర్షపాతం నమోదు!

అబ్బాయి ఆర్థికంగా స్థిరపడినా, అమ్మాయి తల్లిదండ్రులు సంతృప్తి చెందడం లేదు. ఆడపిల్లలు సరైన భాగస్వామిని నిర్ణయించేటప్పుడు, మంచి ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, రూపురేఖలు మరియు సంపద వంటి అనేక అంశాలు పరిగణించి ఆ తర్వాతే ఓకే అంటున్నారు . దీంతో కొంతమంది అబ్బాయిలకు వధువు కుటుంబానికి రివర్స్ కట్నాన్ని ఇవ్వడమే కాకుండా , అన్ని వివాహ ఖర్చులను మేమె కవర్ చేస్తాము అని అనేక తప్పడం లేదు .

1990-1996 వరకు ఒక కుటుంబానికి ఒక బిడ్డ మాత్రమే అనే ధోరణి కొన్ని సామాజిక వర్గాల్లో మహిళల కొరతకు కారణమని చెప్పవచ్చు. అది పక్కన పెడితే అమ్మాయిలకి వారి తల్లి దండ్రులకు,సామజిక జ్ఞానం, పెళ్లి మీద సరైన అవగాహనా కలగడం వల్ల పెళ్లి వ్యవస్థ లో ఈ రకమైన మార్పులు రావడం జరుగుతుంది. ఇప్పుడు పెళ్లిళ్లు అబ్బాయి యొక్క ఆస్థి, సంపద బట్టి కాకుండా విద్య, ఉద్యోగ స్థిరత్వం,గుణ గణాల బట్టి నిర్ణయించడం అలాగే ఆడపిల్లలకు తమకు నచ్చిన వ్యక్తిని తామే ఎంచుకునే ఆలోచన, స్వతంత్రం దొరకడం మంచి మార్పు అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి:

హైదరాబాద్‌ :ఏప్రిల్లో దశాబ్దంలోనే మూడవ అత్యధిక వర్షపాతం నమోదు!

image credit: pxFuel

Share your comments

Subscribe Magazine