News

తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్న మిల్లర్లు ...

Srikanth B
Srikanth B
తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్న మిల్లర్లు
తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్న మిల్లర్లు

తెలంగాణాలో ధాన్యం కొనుగోలు ప్రారంభంకాగానే రైతుల నోటినుంచి వచ్చే ఒకే ఒక మాట తాలు ,తరుగు పేరుతో వడ్ల కొనుగోలులో కోతలు విదిస్తున్నారని , క్వింటాలుకు కనిష్టంగా 3 నుంచి 5 కిలోలవరకు కోతలు విధిస్తున్నారని రైతులు తమ ఆవేదనలను వెళ్లబోస్తుంటారు , అధికారులు అన్ని సార్లు మిల్లర్లను హెచ్చరించిన పరిస్థితులు ఎక్కడిక్కడే వున్నాయి మిల్లర్ల కోతలు కొనసాగుతూనే వున్నాయి .

మిల్లర్ల దోపిడీని నిరసనగా అక్కడక్కడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి , ఎక్కడిక్కడ అధికారులు హెచ్చరిస్తున్నపటికి పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు , అకాల వర్షాల తో నష్టపోయిన రైతులకు మిల్లర్ల దోపిడీతో తీవ్ర నష్టం కల్గుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు .

ధరలు లేక 4 టన్నుల మామిడిపళ్ళను ఉచితంగా పంచేసిన రైతు

జగిత్యాలలో ఒక రైతు ఆవేదన :

30రోజులు అవుతుంది నేను పంటను కోసి. 6 ఎకరాల వడ్లు ఇక్కడ నిల్వకు ఉంచాం. వర్షాల కారణంగా కొనుగోళ్లు జరగలేదు. మా వడ్లు జోకి పది రోజులు అవుతోంది . ఇక తూకం వేస్తుండగా తరుగు పేరుతో కోత విధిస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో ఎంతో నష్టపోయాం. మద్దతు ధర లేక ఇంకా నష్టపోతున్నాం. ఇక తేమ, తరుగు పేరుతో కోతలు విధిస్తే మేమెట్లా బతకాలి అని రైతులు వాపోతున్నారు .

ధరలు లేక 4 టన్నుల మామిడిపళ్ళను ఉచితంగా పంచేసిన రైతు

Share your comments

Subscribe Magazine

More on News

More