ఈ సంవత్సరం పత్తి రైతులకు అంతగా కలిసి రాలేదు తగ్గినా దిగుబడి , కలిసిరాని మద్దతుధరతో రైతులు నష్టపోయారు అయితే అధిక దిగుబడి రాకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాలు కూడా తయారయ్యాయి. ఇన్ని రోజులు తగ్గుముఖం పట్టిన పత్తి ధర కాస్త పెరిగింది. మార్కెట్లో నెల రోజులుగా తగ్గిన పత్తి ధర క్రమంగా పెరుగుతోంది.
పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో ఇన్నాళ్లు పత్తికి ధరలు సరిగ్గా లేకపోవడంతో రైతులు పత్తిని విక్రయించలేదు. ఇన్నాళ్లకు ధరలు పెరగడంతో ఇంట్లో మరియు గోదాముల్లో నిల్వ ఉంచిన పత్తిని రైతులు మార్కెట్ లోకి విక్రయిస్తున్నారు.
ఇన్ని రోజులు తగ్గుముఖం పట్టిన పత్తి ధర, ప్రస్తుతం మార్కెట్ లో పత్తి ధర కాస్త పెరిగింది. మార్కెట్ లో కొన్నీ రోజుల క్రితం పత్తి ధర రూ.7,300- రూ.7,400 వరకు పలికింది. రైతులకు కొంచెం ఊరట కలిగిస్తూ, ఈ పత్తి ధర అనేది రూ.8200 వరకు పలికింది. దీనితో ఇప్పటి వరకు ఇంటి వద్దనే పత్తిని నిల్వ చేసుకున్న రైతులు మార్కెట్ లోకి విక్రయిస్తున్నారు. కొద్దిగా పత్తి ధర పెరగడం రైతులకు కొంచెం ఊరట కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి..
రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు.. వాతావరణ శాఖ సూచనలు జారీ !
పత్తి పంటను సాగు చేసిన రైతులకు మార్కెట్ లో ఆశించిన దిగుబడులు లేకపోవడంతో సుమారుగా 50 శాతం మంది రైతులు పత్తిని నిల్వ ఉంచుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తెల్లబంగారం నల్లబడింది. నవంబర్‌లో పత్తికి రూ.9వేల పైన ధర పలికిన ధర ఇంకా పెరుగుతుందని మార్కెట్ కి రైతులు విక్రయించలేదు. కానీ ఈ ధర రూ. 6 వేలు 7 వేలు వరకు పడిపోయింది. ఈ నెలలో క్వింటాలు పత్తి ధర రూ. 8,200 పలకడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
పంట చేతి కి వచ్చిన సమయంలో వెంటనే విక్రయిస్తే మంచి తూకం వచ్చేది. కానీ ఇన్ని రోజులుగా ఇండ్లు, పంట చేన్లల్లో మండెలు నిల్వ ఉంచడంతో తూకం తగ్గుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు చెపింది రేటు ఇచ్చిందే మద్దతు ధర అన్న చందనం గ మారింది రైతుల పరిస్థితి. గత కొన్ని రోజులగా పత్తికి మద్దతు ధర లేక రైతులు పత్తి పంటను ఇంట్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments