News

రైతుల కోసం మరో పథకం.. ఏడాదికి రూ.12 వేలు అకౌంట్లో జమ

KJ Staff
KJ Staff
former
former

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేల చొప్పున ప్రతి ఏడాది ఎకరానికి రూ.10 వేలు ఇస్తోంది. రైతులకు పెట్టుబడి సాయంగా వీటిని అందిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ.7 వేలు సాయం అందిస్తోంది. ఇలాగే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సంబంధం లేకుండా రైతుల కోసం అనేక ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం రైతుల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరే ముఖ్యమంత్రి కిసాన్ మిత్రా ఎనర్జీ యోజన. ఈ పథకం ద్వారా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12 వేలు అందించనున్నారు. ఈ పథకానికి ప్రతి ఏడాది రూ.1450 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. ప్రతి నెలా వెయ్యి రూపాయల నగదును నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనుంది.

ఇప్పటివరకు 15 లక్షల మంది లబ్ధిదారులకు చేరారు. వీరికి మార్చి నుంచి చెల్లింపులు చేస్తున్నారు. గతంలో కూడా రాజస్థాన్ లో ఇలాంటి పథకం అమల్లో ఉంది. బీజేపీ నుంచి వసుంధర రాజే సింధియా అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ కనెక్షన్లు ఉన్న రైతులకు నెలకు రూ.833 ఇచ్చేవారు. అయితే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రూ.వెయ్యికు పెంచింది. రూ.వెయ్యి పెంచుతామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ హామీని రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే రాజస్థాన్ లోని ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఈ క్రమంలో రైతులకు ఆర్ధిక సాయం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Share your comments

Subscribe Magazine