News

తాజ్ మహల్ పై పరిశోధనకు పిటిషన్ వేస్తే రూ.1 లక్ష ఫైన్.. సుప్రీం కోర్టు

Srikanth B
Srikanth B
Rs. 1 lakh fine on a petition is filed for investigation on Taj Mahal
Rs. 1 lakh fine on a petition is filed for investigation on Taj Mahal

ఈమధ్య కాలంలో పురాతన కట్టడాలపై పరిశోధనలు జరపాలని .. వివిధ ప్రభుత్వ సంస్థలకు మరియు కోర్టు లలో పిటిషన్ వేసేవారు సంఖ్య పెరిగి పోయింది . ఈమధ్య కాలంలోనే 400 సంవత్సరాల పురాతనమైన తాజ్ మహల్ కట్టడం పై పరిశోధన జరిపి వాస్తవాలను ఆ కట్టడం పూర్వ రూపం వెల్లడించేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తేల్చాలని దాఖలైన పిటిషనును కొట్టేసిన సుప్రీం కోర్టు.. పిటిషనర్ పై లక్షరూపాయల జరిమానా కూడా విధించింది .

నాలుగు వందల సంవత్సరాలు దాటినా తాజ్ మహల్ చరిత్రపై ఇప్పుడు పరిశోధన జరపాలంటూ ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది . ఇంకా తాజ్ మహల్ 400 సంవత్సరాలు గ అక్కడే ఉందని కోర్టు సమయం వృధా చేసేలా ఎలా పిటిషన్ దాఖలు చేయవద్దని .. పబ్లిసిటి కోసం వేరే పనులను ఎంచుకోవచ్చని అవసరం లేని పిల్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్ కు రూ. 1 లక్ష జరిమానా విధించింది.

పాత 500, 1000 నోట్లు మార్చుకొని వారికోసం పరిష్కార మార్గాన్ని చుడండి - సుప్రీం కోర్టు

డాక్టర్ సచ్చిదానంద పాండే అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు దీనికి నిరాకరించింది. ఈ పరిశోధనకై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసుకోవాలని, తాజ్ చరిత్రపై పరిశోధన చేయాలా.. వద్దా.. అనేది ఆ సంస్థకే వదిలేయాలని పేర్కొంది. ఈ విషయంలోకి కోర్టును లాగొద్దని పిటిషనర్ కు సూచించింది. 400 సంవత్సరాలుగా తాజ్ మహల్ అక్కడే ఉందని కూడా హితోపదేశం చేసింది .

పాత 500, 1000 నోట్లు మార్చుకొని వారికోసం పరిష్కార మార్గాన్ని చుడండి - సుప్రీం కోర్టు

Share your comments

Subscribe Magazine

More on News

More