News

రూ. 2000 నోట్లు 88 శాతం రికవరీ ..

Srikanth B
Srikanth B
రూ. 2000 నోట్లు 88 శాతం రికవరీ ..
రూ. 2000 నోట్లు 88 శాతం రికవరీ ..

కేంద్ర ప్రభుత్వం రూ . 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే మే నెలలో రూ . 2000 ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినRBI ,ఈ నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది అయితే ఇప్పటివరకు రెండువేల నోట్లను చలామణి నుంచి ఎంతమేరకు రికవరీ చేశారనేది RBI వెల్లడించింది.

క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా ఆర్బీఐ 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 87 శాతం నోట్లు బ్యాంక్‌ల్లో డిపాజిట్ల రూపంలో వచ్చాయి. మిగిలినవి నేరుగా బ్యాంక్‌ కౌంటర్ల నుంచి మార్చుకున్నవి ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. 2000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ లోగానే ప్రజలు నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ కోరింది.

పీఎం యశస్వి యోజన: విద్యార్థులకు రూ.1.25 లక్షల స్కాలర్‌షిప్‌ .. ఆగస్టు 10 చివరి తేదీ

చలామణి నుంచి ఉపసంహరించుకున్న 2000 రూపాయల నోట్లు ఇప్పటి వరకు 88 శాతం బ్యాంక్‌లకు తిరిగి వచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇప్పటి వరకు 3.14 లక్షల కోట్లు ఈ నోట్లు బ్యాంక్‌ల వద్దకు వచ్చాయని తెలిపింది.ఈ సంవత్సరం మార్చి 31నాటికి 3.62 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

పీఎం యశస్వి యోజన: విద్యార్థులకు రూ.1.25 లక్షల స్కాలర్‌షిప్‌ .. ఆగస్టు 10 చివరి తేదీ

Related Topics

rbi annual report

Share your comments

Subscribe Magazine

More on News

More