మనం రోజు టీవీ లలో ఇన్‌స్టంట్ ఫుడ్ పై వచ్చే యాడ్ లను తేలికగా తీసుకుంటాము , అందులో ఇన్‌స్టంట్ ఫుడ్ రెండు నిమిషాలలో మూడు నిమిషాలలో రెడీ అని కంపెనీలు తమ ప్రోడక్ట్ తాలూకా ప్రచారం చేస్తుంటాయి మరియు కొన్ని కంపెనీలు అయితే వాటిని ప్రోడక్ట్ పై కూడా ముద్రిస్తాయి . మనం కంపెనీ ప్రచారంలో చెప్పిన విధంగ ఇన్‌స్టంట్ ఫుడ్ తయారైందా లేదా అనేది పట్టించుకోము అయితే ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీరేజ్ అనే మహిళా క్రాఫ్ట్ హీంజ్ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్‌ను ఖరీదు చేసింది .
ప్యాక్ పై క్రాఫ్ట్ హీంజ్ కంపెనీ కంపెనీ ప్రకారం పాస్తా కేవలం మైక్రోవేవ్‌లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని అని రాసి వుంది దానిని గమనించిన మహిళా ప్యాక్ పై ఇచ్చిన సమాచారం మేరకు మైక్రోవేవ్‌లో ఉడికిస్తే పాస్తా ఉడకలేదని ఫుడ్ కంపెనీపై రూ.40కోట్లు దావా వేసింది . కంపెనీ ప్యాక్‌పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన నష్టానికి రూ.80 లక్షలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది.
పాత 500, 1000 నోట్లు మార్చుకొని వారికోసం పరిష్కార మార్గాన్ని చుడండి - సుప్రీం కోర్టు
మనం కూడా నిత్య జీవితం చాల యాడ్ లను చూస్తుంటాము కానీ కంపెనీ ప్రచారం చేసిన విధముగా ఉత్పత్తులు, వస్తులు ఉన్నయలేదా అనేది పట్టించుకొము కేవలం కొనడం వరకే మన బాధ్యత గ భావిస్తుంటాము , కానీ అ మహిళా చేసిన పనికి వినియోగదారులను పక్కదారి పట్టించే వారికీ తగిన గుణపాఠం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు .
Share your comments