తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే, ఎన్నికల సమయంలో ప్రకాయించిన మరొక హామీని నెరవేర్చడానికి సిద్దమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. రూ.500లకే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
పైన పేర్కొన్నట్లుగా ధరకే గ్యాస్ సిలిండర్లు అందించే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన మంత్రి రెడ్డి ఇటీవల పౌరసరఫరాల శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడానికి దాదాపు 100 రోజులు పడుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆరు వాగ్దానాలు చేసింది, వాటిలో ముఖ్యమైనది రూ.500 వంట గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టడం.
అయితే, ఈ పథకం యొక్క వాస్తవ అమలు చుట్టూ అనేక ఆందోళనలు మరియు అనిశ్చితులు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని, గ్యాస్ సిలిండర్ కేవలం రూ.500కే అందేలా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సందేహాలకు సమాధానంగా సంబంధిత శాఖ బాధ్యులైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల పౌరసరఫరాల శాఖతో సమావేశమై చర్చించారు.
ఇది కూడా చదవండి..
ఏపీలో మరో సంచలన సర్వే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే?
అయితే, గ్యాస్ సిలిండజర్ రూ.500 రూపాయలకు ఇచ్చే అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం 100 రోజుల గడువు పడుతుందని తేల్చి చెప్పారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రూ.56 వేల కోట్ల నష్టంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పౌసరఫరాల శాఖ ఆర్థిక పరిస్థి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్న మంత్రి ఈ నష్టానికి గత పాలకుల తప్పిదాలే కారణమని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే తమ ఆరు హామీల్లో ఒకటిగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీల్లో రెండోది రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం ఏర్పాటు. ఈ పథకం అమలును పేద మరియు మధ్యతరగతి వర్గాలకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments