News

ఏపీలో మరో సంచలన సర్వే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే?

Gokavarapu siva
Gokavarapu siva

తాజాగా ఏపీలో జరిగిన ఓ సర్వేలో సంచలనం రేపుతోంది. వ‌చ్చే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో వివిధ స‌ర్వేలు ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చినా ఆశ్చర్యం లేదు. అలాంటి ఒక సర్వేను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కొండ్రేగుల ప్రసాద్ విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు నేపథ్యంలో, ఏ పార్టీ విజేతగా నిలవనున్నది అన్నది నియోజకవర్గాల వారీగా ఫలితాలను వెల్లడించారు. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. అటు వైసిపి, ఇటు టిడిపి, జనసేన ఓట్లను లెక్కించి మరి ఫలితాలను వెల్లడించడం విశేషం.

ఈ సర్వేని కొండ్రేగుల ప్రసాద్ ఈ నెల 19వ తేదీన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ మొత్తం 151 స్థానాలను కైవసం చేసుకుని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు, టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. జనసేనకు ఒకే ఒక స్థానం దక్కింది. అయితే ఈసారి వైసిపి గణనీయమైన సీట్లు పోగొట్టుకోనుంది. వారి సీట్ల సంఖ్య కేవలం 34 కి తగ్గుతుంది.

తెలుగుదేశం,జనసేనకూటమి 141 స్థానాల్లో ఘన విజయం సాధించనుందని సర్వే తేల్చడం విశేషం. కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన సర్వే ప్రకారం ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీకి 34 సీట్లలో కేవలం ఆరు స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేయడంతో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వైసీపీ ప్రభావం ఈ ఎన్నికలలో తగ్గుముఖం పట్టనుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..

మళ్ళి విజృంభిస్తున్న కోవిడ్ కొత్త వేరియెంట్.. కేంద్ర ప్రభుత్వం అలెర్ట్..!

అయితే క‌డ‌ప, చిత్తూరు, క‌ర్నూలు వంటి కొన్ని ప్రాంతాల‌లో వైసీపీకి మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. దీనికి విరుద్ధంగా గోదావరి, కోస్తా జిల్లాల్లోనూ వైసీపీకి ఓటమి తప్పదని తేలింది. మరోవైపు తెలుగుదేశం, జనసేన కూటమి అత్యధిక సీట్లు సాధిస్తుందని అంచనా. వైసీపీ గెలుపొందిన ప్రాంతాల్లో స్వల్ప ఓట్ల తేడాతో గెలుస్తారని అంచనా వేస్తున్నారు. 5,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో మెజారిటీ విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది.

పాలకొండ, కురుపాం, చీపురుపల్లి, వి. మాడుగుల, అరకు, పాయకరావుపేట, పెద్దాపురం, అనపర్తి, రంపచోడవరం, గోపాలపురం, గుడివాడ, పామర్రు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, గూడూరు, రాజంపేట, కడప, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదకూరు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, సింగనమల, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో మాత్రమే వైసిపి గెలిచే ఛాన్స్ ఉంది.

టీడీపీ మరియు జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది, రెండు పార్టీలు అపారమైన ఆనందం మరియు ఉత్సాహాన్ని వెదజల్లుతున్నాయి. ఈ పరిస్థితి నిస్సందేహంగా వైసీపీకి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి..

మళ్ళి విజృంభిస్తున్న కోవిడ్ కొత్త వేరియెంట్.. కేంద్ర ప్రభుత్వం అలెర్ట్..!

Share your comments

Subscribe Magazine