రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబంధు డబ్బులకోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు జూన్ నెలలో రైతు బందు వస్తుందని కొన్ని మీడియా కధనాలు వెల్లడించిన్నపటికి రైతుబంధు డబ్బులు జూన్ నెలలో వచ్చే అవకాశాలు తక్కువ గ కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులనుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది అయితే ఈ ప్రక్రియ ఎంతకాదన్న మరో 15 రోజులు, ఆ తరువాత కొత్తగా రైతుబంధు లబ్దిదారుల జాబితాను అధికారులు ఖరారు చేయడంలో మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం వుంది . దీనితో రైతులు ఆశించిన విధంగా జూన్ నెలలో రైతుబంధు విడుదల అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ కొంచం వేగంగా పూర్తయితే జూన్ చివరలో లేదా జులై మొదటి వారంలో రైతుబంధు వచ్చే అవకాశం ఉందని కొన్ని మీడియా కథనల ద్వారా స్పష్టం అవుతుంది .
ఇప్పటికీ రైతుబంధు పొందని రైతులు క్రింద సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి :
వానాకాలం సీజన్ కోసం రైతు బంధు పెట్టుబడి సాయం కోసం కొత్త గ పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు లేదా ఇప్పటివరకు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొని రైతులు సంబంధిత మండల విస్తరణ అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకోవాలని ,దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఇంకా నిర్ణయించబడలేదని అయితే రైతులు మాత్రం ఆలస్యం చేయకుండా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారులు తెలిపారు .
- దరఖాస్తుకు అవసరమైన పత్రాలు :
పట్టాదార్ పాస్ పుస్తకం
ఆధార్‌కార్డు
బ్యాంక్ ఖాతా పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీలు తీసుకొని పని దినాలలో దరఖాస్తు చేసుకోవాలి .
రైతుబంధు పథకం :
రైతుబంధు పథకాన్ని మే 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గత మూడేళ్లుగా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకం రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు సహాయం చేయడానికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద రైతులకు పంట సీజన్‌కు ఎకరానికి రూ.5,000 నగదు పెట్టుబడి సాయంగా అందిస్తుంది.
Share your comments